పాకిస్థాన్ పై భారత్ గెలిచేసింది. ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ. మ్యాచ్ విన్ అయిన తర్వాత అందరూ హార్దిక్ పాండ్యాని తెగ పొగిడేస్తున్నారు. కానీ ఇక్కడ కోహ్లీని కూడా కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. అసలు కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ ఏంటి స్పెషల్ అంటారా? అయితే ఈ స్టోరీ చివరి వరకు చదివేయండి.
వివరాల్లోకి వెళ్తే.. విరాట్ కోహ్లీకి మూడేళ్లుగా సెంచరీ లేదు. ఐపీఎల్ లో ధనాధన్ బ్యాటింగ్ చేసి ఫామ్ లోకి వస్తాడనుకుంటే అదీ జరగలేదు. ఇంగ్లాండ్ తో రాణించడం పక్కా అనుకుంటే.. అక్కడ సేమ్ సీన్ రిపీట్. ఇవన్నీ చూసి చూసి విసిగిపోయిన ఫ్యాన్స్.. సెంచరీ సంగతి పక్కనబెడితే.. విరాట్ కనీసం హాఫ్ సెంచరీ చేసినా సరే చాలనుకునే స్టేజీకి వచ్చేశారు.
వరసపెట్టి మ్యాచులు ఆడుతుండటం వల్లే కోహ్లీ.. ఇలాంటి పరిస్థితికి వచ్చాడని అనుకున్నారు. విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు దిగ్గజ క్రికెటర్లు చాలామంది కోహ్లీకి సూచించారు. దీంతో ఇంగ్లాండ్ పర్యటన తర్వాత దాదాపు నెలన్నరపాటు కోహ్లీ రెస్ట్ తీసుకున్నాడు. ఇక విరామం తర్వాత కోహ్లీ.. పాక్ తో మ్యాచ్ లో ఎలా ఆడతాడా అని అభిమానులకు ఒకటే టెన్షన్.
Special win on a special day! 🇮🇳 pic.twitter.com/7WmE7GeJMD
— Virat Kohli (@imVkohli) August 28, 2022
కానీ, మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్.. ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ నుంచి తప్పించుకున్నాడు. పాక్ ఆటగాడు క్యాచ్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. గత ఆరు నెలలుగా బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డ కోహ్లీ.. పాక్ తో మ్యాచ్ లో మాత్రం పూర్తి కాన్ఫిడెన్స్ తో కనిపించాడు.
Congratulations @imVkohli on your 100th T20 game for India. Welcome to the club. I look forward to watching many more of your games in the years to come!
— Ross Taylor (@RossLTaylor) August 29, 2022
కోహ్లీ ఆ మ్యాచ్‌లో తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. ఓవైపు కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతుంటే.. కోహ్లీ మాత్రం చాలా జాగ్రత్తగా ఆడుతూ, అవసరమైనప్పుడు బౌండరీస్ కొడుతూ స్కోరు బోర్డుని మెల్లగా పరుగులు పెట్టించాడు. దీంతో టాప్ ఆర్డర్ సరైన భాగస్వామ్యం నెలకొల్పింది. రోహిత్-కోహ్లీ కలిసి రెండో వికెట్ కి 49 పరుగులు జోడించారు. ఇక 35 పరుగులు చేసిన కోహ్లీ.. నవాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
The craze for Virat Kohli among Pakistan fans is huge. pic.twitter.com/j88BIBfXI0
— Johns. (@CricCrazyJohns) August 28, 2022
చివర్లో హార్దిక్-జడేజా.. చక్కని సమన్వయంతో ఆడుతూ మ్యాచ్ ని గెలిపించారు. ఇక్కడ అందరూ మ్యాచ్ ఫినిషర్ హార్దిక్ ని మెచ్చుకుంటున్నారు. కానీ, మనం కచ్చితంగా కోహ్లీని ప్రశంసించాలి. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఆట విషయంలో తడబడుతున్న కోహ్లీ.. పాక్ తో మ్యాచ్ లో మాత్రం కమ్ బ్యాక్ ఇచ్చినట్లు కనిపించాడు. చక్కని టైమింగ్‌తో షాట్స్ ఆడుతూ నిలకడ కనబరిచాడు.
Virat Kohli and run chases against Pakistan. Never ending story ❤️ pic.twitter.com/A7UzIZFqtQ
— Pari (@BluntIndianGal) August 28, 2022
ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసేటప్పుడు కోహ్లీ నిల్చున్న పొజిషన్, ఆడిన షాట్లు.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తనపై తనకు విశ్వాసం అతడి కళ్లల్లో స్పష్టంగా కనిపించాయి. ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మిస్ చేసినా సరే.. మిగతా మ్యాచ్ ల్లో పరుగులు వరద పక్కా అని కోహ్లీ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతోంది. కోహ్లీ కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు.. ఈ ఆసియాకప్ పూర్తయ్యేలోపు ఫామ్ లోకి వచ్చి సెంచరీ కొట్టేస్తాడేమో చూడాలి. మరి కోహ్లీ సెంచరీ కోసం మీలో ఎంతమంది ఎదురుచూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Andd the King is Back@imVkohli pic.twitter.com/w0qOgJMiYn
— ViratABDGang (@imkohli9705) August 28, 2022