CSK vs Gujarat Titans: ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో.. సోషల్ మీడియాలో హడావిడి చూస్తే అర్థమైపోతుంది. అయితే తొలి మ్యాచ్ జరుగుతుందా? లేదా? కంగారు కూడా వారిలో ఉంది. మరి ఇంతకూ గుజరాత్-చెన్నై మ్యాచ్ జరుగుతుందా?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కావాల్సింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడాల్సి ఉంది. అయితే ఈ ఆరంభ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగే అవకాశం లేదంటూ.. గురువారం రాత్రి నుంచి వార్తలు సైతం వస్తున్నాయి. గుజరాత్‌లో గురువారం సాయంత్ర భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదంటూ.. క్రికెట్ అభిమానులను నిరాశపరిచే సమాచారం అందింది. దీంతో తొలి మ్యాచ్ జరగదేమో అనే ఆందోళనలో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. పైగా మ్యాచ్‌కు ముందు జరిగే ఓపెనింగ్ సెర్మనీ కూడా రద్దు అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
కాగా, ప్రస్తుతం గుజరాత్‌లో వాతావరణ పరిస్థితిలు సాధారణంగా ఉండటంతో రాత్రి మ్యాచ్ జరుగుతుందని సమాచారం. గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో గల నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమాలు జరగనున్నాయి. తమన్నా, రష్మికా మంధాన లాంటి స్టార్లు ఈ ఓపెనింగ్ సెర్మనీ వేడుకల్లో తమ డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. లేజర్ లైటింగ్ వెలుగుల్లో ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత చెన్నై-గుజరాత్ మధ్య తొలి మ్యాచ్‌కు టాస్ పడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గురువారం రాత్రి వర్షం పడుతున్న విషయాన్ని గుజారత్ కోచ్ ఆశిష్ నెహ్రా వీడియో పోస్టు చేయడంతో క్రికెట్ అభిమానులు కంగారు పడ్డారు. కానీ, మ్యాచ్ నిర్వహణ సజావుగా సాగుతుందని తాజా సమాచారం. మరి తొలి మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ashish Nehra enjoying the Rain at Narendra Modi stadium 😅 pic.twitter.com/ORsAwvLMMD
— Cricket Updates (@TheCricPerson) March 31, 2023