బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 41.2 ఓవర్లలో 186 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ 73 పరుగులు చేసి రాణించాడు. కానీ.. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. అయినా కూడా భారత బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. 136 పరులకే 9 వికెట్లు పడగొటి.. భారత్‌ను విజయానికి చేరువ చేశారు. కానీ.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, మెహదీ మిరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. చివరి వికెట్‌కు ముస్తఫిజుర్‌తో కలిసి ఏకంగా 51 పరుగల విలువైన భాగస్వామ్యం నెలకొప్పిన మెహిదీ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమి చవిచూసి.. తీవ్ర విమర్శల పాలైన టీమిండియా, ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లి తొలి వన్డేలోనే దారుణ ఓటమిని చవి చూసింది. దీంతో మరోసారి భారత క్రికెట్ అభిమానులు టీమిండియాపై మండిపడుతున్నారు. చివరి బంగ్లాదేశ్‌పై కూడా ఓడిపోతే క్రికెట్ చూడటమే మానేయాల్సివస్తుందని అంటున్నారు. ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన టీమ్‌తో ఓడారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. బంగ్లాదేశ్‌పై కూడా వన్డే మ్యాచ్‌లో ఓడితే మ్యాచ్ చూసేందుకు విరక్తి వస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇలా క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాపై మరో భారీ దెబ్బ పడింది. బంగ్లాదేశ్‌తో జరిగిన స్లోవర్ రేట్ కారణంగా టీమ్ మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించారు. ఓటమి భారంతో ఉన్న టీమిండియాకు ఇది దెబ్బ మీద దెబ్బలా తయారైంది. కాగా.. మొత్తం మూడు వన్డేలతో పాటు రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా రెండో వన్డే ఈ నెల 7న ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో, మూడో వన్డే 10న చిట్టగాంగ్‌లో ఆడనుంది. 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. తొలి వన్డే ఓడిన టీమిండియా రెండో వన్డేలో ఎలాగైన గెలిచి సిరీస్‌ను సమం చేసి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.
India have been fined 80% of the match fee for slow over-rate in the first ODI.
— Johns. (@CricCrazyJohns) December 5, 2022