ఆసియా కప్ 2022లో టీమిండియా తర్వాత మరో హాట్‌ఫేవరేట్‌గా ఉన్న టీమ్ పాకిస్థాన్. మనకు నచ్చినా నచ్చకపోయినా మన తర్వాత బలమైన టీమ్ పాకిస్థానే. కానీ.. టీమిండియా సూపర్ ఫోర్ స్టేజ్‌లో భారత్ ఇంటికి చేరితే.. పాకిస్థాన్ ఫైనల్లో బోల్తా కొట్టింది. గ్రూప్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక ఆసియా కప్ గెలుస్తుందని ఎవరూ కనీసం ఊహించలేదు. కానీ. ఆ తర్వాత వారి ఆట పూర్తిగా మారిపోయింది. దెబ్బతిన్న పులిలా వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ఆసియా కప్‌ను ఆరోసారి ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంక అద్భుత ప్రదర్శన చేసినా.. పాకిస్థాన్ ఫీల్డింగ్‌లో చేసిన కొన్ని భారీ తప్పిదాలు కూడా శ్రీలంక విజయానికి ఎంతో సహకరించాడు. 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి శ్రీలంక 170 పరుగులు సాధించిందంటూ అందుకు పాక్ ఫీల్డర్ల హస్తం ఉంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో వెన్నుముకగా నిలిచిన భానుక రాజపక్సాకు ఊహించని లైఫ్‌లు ఇచ్చిన పాక్ ఫీల్డర్లు భారీ మూల్యం చెల్లించుకుంది.
ముఖ్యంగా పాక్ స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ఒక క్యాచ్‌ను వదిలేయడం, మరోసారి ఆసిఫ్ అలీ తీసుకుంటున్న క్యాచ్‌కు అనవసరంగా అడ్డుతగిలి రెండుసార్లు రాజపక్సాకు లైఫ్ ఇచ్చాడు. దీంతో రాజపక్సా పాక్ చేయాల్సిన నష్టం చేశాడు. ఇక బ్యాటింగ్‌లోనూ పాక్ విఫలం అవ్వడంతో ఆసియా కప్ విజేతగా శ్రీలంక నిలిచింది. మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ ఫీల్డింగ్‌పై, ముఖ్యంగా షాదాబ్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాకిస్థాన్ ఎంత అద్భుతంగా డెవలప్ అయినా.. ఫీల్డింగ్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నారు. గతంలోనూ ఒక క్యాచ్ కోసం ఇద్దరిద్దరు ఫీల్డర్లు వచ్చి ఢీ కొని క్యాచ్‌ను నేలపాలు చేయడం చూశాం. తాజాగా శ్రీలంకతో ఆడిన ఫైనల్‌లోనూ పాక్ ఫీల్డర్లు తమ సంప్రదాయం కొనసాగించారని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.
ఈ ట్రోల్స్‌పై పాకిస్థాన్ సీనియర్ పేసర్ హసన్ అలీ స్పందించాడు. స్టేట్‌మెంట్‌తో కాకుండా ఒక వీడియోతో ట్రోల్ చేసే వారికి కౌంటర్ ఇచ్చాడు. షాదాబ్ ఖాన్ రెండు క్యాచ్‌లు మిస్ చేసినంత మాత్రం అతని టాలెంట్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయలేరని అర్థం వచ్చేలా.. గతంలో షాదాబ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌లను వీడియో రూపంలో తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. కానీ హసన్ అలీ పోస్టు చేసిన వీడియోపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. చేసిందంతా చేసి.. ఆసియా కప్ పోగొట్టి మళ్లీ ఎందుకీ వెస్ట్ పోస్టులంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం షాదాబ్‌కు హసన్ అలీ మద్దతుగా నిలవడంపై మరికొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘ఐ లవ్ ఇండియా’ అంటూ పాకిస్థాన్ క్రికెటర్ సంచలన స్టేట్‌మెంట్!
— Hassan Ali 🇵🇰 (@RealHa55an) September 12, 2022
Feeling like Shadab today👍🏻 pic.twitter.com/efNzIKIQt5
— Y. (@_yakta) September 12, 2022