పాకిస్థాన్ స్టార్ పేసర్ హసన్ అలీ ‘ఐ లవ్ ఇండియా’ అని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఒక పాకిస్థాన్ క్రికెటర్ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్ రావడం నిజంగా సంచలన విషయమే. టీమిండియాపై విమర్శలు గుప్పిస్తూ.. సవాళ్లతో నోరు పారేసుకునే పాక్ క్రికెటర్లేనే ఇంతవరకు చూశాం. కానీ.. ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఐ లవ్ ఇండియా అంటూ తొలి సారి హసన్ అలీ చెప్పడం గొప్ప విషయం. ప్రస్తుతం ఆసియా కప్‌లో ఇండియా-పాకిస్థాన్ జట్లు బిజీగా ఉన్నాయి. ఆదివారం(ఆగస్ట్ 28) దాయాదుల పోరు కూడా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి.. ఆసియా కప్ వేటను ఘనంగా ప్రారంభించింది.
గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో తలపడ్డా.. ఇండియా-పాకిస్థాన్ మళ్లీ ఆసియా కప్ వేదికగా ఢీకొన్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను పాక్ ఓడిస్తే.. ఆసియా కప్‌లో టీమిండియా పాక్‌పై గెలిచి బదులు తీర్చుకుంది. ఈ రెండు జట్లు తమ తర్వాత మ్యాచ్‌ను పసికూన హాంకాంగ్‌తో ఆడనున్నాయి. ఇక ఆసియా కప్ కోసం పాకిస్థాన్ జట్టులో ఉన్న హసన్ అలీకి భారత్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కలేదు. అసలు తొలుత అతన్ని ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన 15 సభ్యుల జట్టులో చోటు కల్పించలేదు. జూనియార్ వసీమ్ అక్రమ్ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వడంతో హసన్ అలీకి అనూహ్యంగా అవకాశం దక్కింది.
ఇక ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత హాంకాంగ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక లేడీ జర్నలిస్ట్ హసన్ అలీతో మాట్లాడేందుకు ప్రయత్నించి.. ‘భారత్‌లో మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు.’ చెప్పగా.. ‘ఐ లవ్ ఇండియా.. భారత్ నుంచి అభిమానులు ఉంటారుగా..’ అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హసన్ అలీ స్టేట్‌మెంట్‌పై ఇండియన్ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి హసన్ అలీ ఐ లవ్ ఇండియా అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వినాయక చవితి రోజు భారతీయుల హృదయాలను కొల్లగొట్టిన వార్నర్!