ప్రస్తుతం టీమిండియా దృష్టి మొత్తం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌పైనే ఉంది. టోర్నీ ఆరంభానికి 17 రోజుల ముందుగానే కంగారుల గడ్డపై ల్యాండైన టీమిండియా.. ఇప్పటికే వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడింది. అక్కడి పరిస్థితులకు, పిచ్‌లకు దాదాపు అలవాటు పడ్డ భారత ఆటగాళ్లు.. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో దుమ్మురేపారు. తొలుత బ్యాటింగ్ కేఎస్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటితే.. బౌలింగ్‌లో మొహమ్మద్ షమీ చివరి ఓవర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. లాస్ట్ ఓవర్‌లో కేవలం 11 పరుగులను డిఫెండ్ చేయాల్సిన దశలో విరాట్ కోహ్లీ సూపర్ ఫీల్డింగ్.. షమీ కళ్లు చెదిరే యార్కర్లతో ఆసీస్ కోరల్లోంచి మ్యాచ్‌ను లాక్కొచ్చారు.
ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. మొహమ్మద్ షమీని పక్కా ప్లాన్ ప్రకారమే చివరి ఓవర్ వేయించామని వెల్లడించాడు. షమీతో లాస్ట్ ఓవర్ వేయించాలనే ప్లాన్ అప్పటికప్పుడు తీసుకున్నది కాదని, మ్యాచ్ ప్రారంభానికి ముందే డెత్ ఓవర్స్‌లో షమీతో ఒక ఓవర్ వేయించాలిన నిర్ణయించామని ఆ ప్లాన్ ప్రకారమే లాస్ట్ ఇచ్చామని పేర్కొన్నాడు. నిజానికి షమీ చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చాడని, కొత్త బంతితో అతను ఎంత ప్రమాదకరమో అందరికి తెలుసని.. కానీ.. డెత్ ఓవర్స్‌లో కూడా బౌలింగ్ చేయాలని అతనికి మేము ఛాలెంజ్ విసిరామని రోహిత్ వెల్లడించాడు. కానీ.. షమీ తానేంటో నిరూపించుకున్నాడని రోహిత్ ప్రశంసించాడు.
ఆసీస్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆస్ట్రేలియాకు 187 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ బ్యాటర్లు కంఫర్ట్‌బుల్‌గానే ఛేంజ్ చేసాలా కనిపించారు. టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సులతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ.. చివర్లో విరాట్ కోహ్లీ సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్‌కు ఆసీస్ ఖంగుతింది. దానికి తోడు.. లాస్ట్ ఓవర్‌లో 11 పరుగులు రక్షించేందుకు వచ్చిన షమీ.. తొలి రెండు బంతులకు రెండు రెండు చొప్పున మొత్తం నాలుగు పరుగులు ఇచ్చి.. తర్వాతి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక రనౌట్ ఉంది. అది కూడా షమీనే చేశాడు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడా ఓటమి తప్పదనున్న మ్యాచ్‌లో గెలిచి.. సంపూర్ణ ఆత్మవిశ్వాసం అందుకుంది.
Captain Rohit Sharma explains why Mohammed Shami bowled only the final over of the warm-up match against Australia.#AUSvIND | @MdShami11 | #T20WorldCup | #T20WorldCup2022 pic.twitter.com/r2DYlpnqXk
— CricTracker (@Cricketracker) October 17, 2022