చిట్టాగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. టాస్ గెలిచి తొలుతు బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్.. శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు అగ్రెసివ్ క్రికెట్ ఆడుతామని చెప్పిన రాహుల్.. మ్యాచ్‌లో మాత్రం ఆ ఇంటెంట్ చూపించలేదు. గిల్, రాహుల్ నిదానంగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలిచిన బంగ్లాదేశ్.. అదే జోరును టెస్టుల్లోనూ కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలోనే యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో పాటు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీని సైతం వెంటవెంటనే అవుట్ చేసి.. తొలి సెషన్‌లో బంగ్లా బౌలర్లు పైచేయి సాధించారు.
40 బంతుల్లో 20 పరుగులు చేసిన గిల్.. తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో యాసిర్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 41 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ వెంటనే 45 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ సైతం అవుట్ అయ్యాడు. 54 బంతుల్లో 22 పరుగులు చేసి రాహుల్.. ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ల పైకి ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వన్‌డౌన్‌లో వచ్చిన టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాల్సిన సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అయితే చివరి వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మాత్రం విఫలం అయ్యాడు.
అయితే విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడిని బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లామ్ చాలా ఈజీగా అవుట్ చేశాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో విరాట్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇస్లామ్ బౌలింగ్‌ను అర్థం చేసుకుని ఆడటంలో లెక్కతప్పిన కోహ్లీ.. తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. అయితే.. స్పిన్‌ను బాగా ఆడే కోహ్లీ లాంటి ప్లేయర్‌ను ఇంత సింపుల్‌గా అవుట్ చేసిన తైజుల్ ఇస్లామ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. కోహ్లీనే అవుట్ చేశాడంటే ఎంత తోపు బౌలరో అంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే బంగ్లాదేశ్ తరఫున 2014లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు తైజుల్ ఇస్లామ్. వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇస్లామ్.. ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడాడు. ఇప్పుడు టీమిండియాతో ఆడుతున్న టెస్టు అతనికి 39వ టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తీసిన రెండు వికెట్లతో కలుపుకుని టెస్టుల్లో ఇప్పటి వరకు 160 వికెట్లు పడగొట్టాడు. కేవలం 39 మ్యాచ్‌ల్లో ఇన్ని వికెట్లు పడగొట్టడం గొప్ప విషయమే.
అయితే.. బంగ్లాదేశ్‌లో స్పిన్ బౌలింగ్‌కు భారీ పోటీ ఉంటుంది. ఎందుకంటే.. అక్కడ స్పిన్ బౌలింగ్ చాలా చిన్న విషయం. ఎక్కువమంది స్పిన్ బౌలింగ్‌ను ఈజీగా నేర్చుకుంటారు. అయితే తైజుల్ ఇస్లామ్.. టెస్టుల్లో ఎంత అద్భుతంగా రాణిస్తున్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. బంగ్లా టీమ్‌లో స్పిన్నర్లకు ఉన్న పోటీ నేపథ్యంలో ఇస్లామ్‌కు అవకాశాలు దక్కేవి కావు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్ స్పిన్నర్ అయిన ఇస్లామ్‌కు టెస్టు ఫార్మాట్‌లో మాత్రం రెగ్యులర్‌గా అవకాశాలు వస్తున్నాయి. ఇక 2014లోనే వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇస్లామ్‌కు కేవలం 12 మ్యాచ్‌ల్లోనే అవకాశం దక్కింది. 12 వన్డేల్లో ఇస్లామ్ 20 వికెట్లు పడగొట్టాడు. రెండు టీ20ల్లో ఒక వికెట్ తీసుకున్నాడు. కాగా.. టెస్టు, వన్డేల్లో ఇస్లామ్ ఎకానమీ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. టెస్టుల్లో 3.04 కాగా, వన్డేల్లో 3.92గా ఉంది. మరి ఈ తైజుల ఇస్లామ్ విరాట్ కోహ్లీని సింపుల్‌గా అవుట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A Unplayable ball from Taijul Islam to dismissed Virat Kohli #INDvsBAN #BANVSIND #CricketTwitter pic.twitter.com/B0kuFxkXQR
— Cricket With Laresh (@Lareshhere) December 14, 2022