ఆస్ట్రేలియా జట్టుకు ఎంతోమంది లెజెండరీ ప్లేయర్లు సారథ్యం వహించారు. అందులో ఒక ప్లేయర్ క్రికెట్ నుంచి సన్యాసం తీసుకున్నారు. ఆ ఆటగాడు ఎవరంటే..!
ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ సారథి టిమ్ పైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో టాస్మానియాకు ప్రాతినిథ్యం వహించిన పైన్.. తన 18 ఏళ్ల బంధానికి నేటితో ముగింపు పలికాడు. శుక్రవారం షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత పైన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడికి సహచర ప్లేయర్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఈ సందర్భంగా టిమ్ పైన్ ఎమోషనల్ అయ్యాడు. ఇక పైన్ తన ఆఖరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో మొత్తంగా 95 మ్యాచ్‌లు ఆడాడు పైన్. 2005లో సౌత్ ఆస్ట్రేలియాపై అతడు ఫస్ట్ క్లాస్‌లో అరంగేట్రం చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక ఔట్‌లు చేసిన టాస్మానియన్ వికెట్ కీపర్‌గా టిమ్ పైన్(295) అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో దాదాపుగా 30 సగటుతో 4 వేలకు పైగా రన్స్ చేశాడు. కాగా, పైన్ కెరీర్‌లో ఎన్నో కాంట్రవర్సీల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా ఓ మహిళకు అభ్యంతరకర మెసేజ్‌లు చేసిన (‘సెక్స్‌టింగ్’) స్కామ్‌లో పైన్ ఇరుక్కున్నాడు. దీంతో 2021లో కీలకమైన యాషెస్ సిరీస్‌లో ఆసీస్ టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ వివాదం పైన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇక, 2018 నుంచి 2021 మధ్య 23 టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుకు పైన్ సారథ్యం వహించాడు. మొత్తంగా అతడు 35 టెస్టులు ఆడాడు. 2018లో సౌతాఫ్రికా టూర్లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల కారణంగా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ నిషేధానికి గురవ్వడంతో పైన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు.
An inspiring captain, one of our finest glovesman, and a legend of Tasmanian and Australian cricket.
Congratualtions Tim Paine on a truly wonderful career 💚❤️💛#WeAreTigers pic.twitter.com/MkWvmBQPRR
— Tasmanian Tigers (@TasmanianTigers) March 17, 2023