టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2022 ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో టీమిండియా చెలరేగడంతో విజయం నల్లేరు మీద నడక అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఐదో టెస్టులో ఓటమి మినహా.. టీ20 సిరీస్, వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్, 2023 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా నుంచి ఇలాంటి మరిన్ని ప్రదర్శనలు కావాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మీద మాత్రం టీమిండియా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇంగ్లాండ్ బోర్డు తీరును ఏకిపారేస్తున్నారు. రిషబ్ పంత్ 42వ ఓవర్లో వరుసగా 5 ఫోర్లు బాదడం అందరూ చూశారు. అయితే అది మాత్రం ఇంగ్లాండ్ బోర్డు పెట్టిన హైలెట్స్ లో ఎక్కడా కనిపించలేదు. కేవలం 5 ఫోర్లు అని స్కోర్ కార్డు చూపించారు. పంత్ సెంచరీ తర్వాత డైరెక్ట్ విన్నింగ్ షాట్ చూపించారు.
A memorable #ENGvIND tour for #TeamIndia as we finish it on a winning note. 🙌 🙌 pic.twitter.com/cxPLXpoBvh
— BCCI (@BCCI) July 17, 2022
ఇండియా విన్స్ ద సిరీస్ అంటూ వీడియో క్లోజ్ చేశారు. ఇంగ్లాండ్ బోర్డు వక్ర బుద్ధి ప్రదర్శించిందంటూ టీమిడింయా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఒకే ఓవర్లో విల్లీ బౌలింగ్ లో పంత్ వరుసగా 5 ఫోర్లు కొడితే ఇంగ్లాండ్ బోర్డుకు కనిపించలేదా? అది హైలెట్స్ ఉండాల్సిన ఓవర్ కాదా? మరి ఎందుకు లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సిరీస్ పోయిందనే అక్కసు ఇలా తీర్చుకున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే..
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆👏👏#TeamIndia | #ENGviND pic.twitter.com/8SETL5xAhh
— BCCI (@BCCI) July 17, 2022
మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా 45.5 ఓవర్లలో 259 పరుగులకే ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసింది. జోస్ బట్లర్(60), జేసన్ రాయ్(41), మొయీన్ అలీ(34) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బౌలింగ్ విషయానికి వస్తే.. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు, చాహల్ 3 వికెట్లు, సిరాజ్ 2, జడేజా 1 వికెట్ తో ఇంగ్లాండ్ ను మట్టికరిపించారు. ఇది హార్దిక్ పాండ్యా అత్తుత్తమ ఆల్రౌండ్ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు.
That Winning Feeling! 👏 🏆
Congratulations to #TeamIndia on winning the three-match ODI series. 👍 👍#ENGvIND pic.twitter.com/fKV5MUuEn6
— BCCI (@BCCI) July 17, 2022
260 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మళ్లీ విఫలం కాగా.. పంత్ వీరోచిత ఇన్నింగ్స్ తో టీమిండియాకి విజయాన్ని కట్టబెట్టాడు. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా బ్యాటుతో ఆకట్టుకున్నాడు. 55 బంతుల్లో 71 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బోర్డు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.