టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం టీమిండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉన్న డీకే ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ ఆడిన డీకే మళ్లీ 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక కావడం నిజంగా విశేషమే. మంచి టాలెంటెడ్ ప్లేయర్ అయినప్పటికీ.. కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఉన్న ఎంఎస్ ధోని జట్టులో ఉండటంతో కార్తీక్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో కార్తీక్ ఆటకు కొన్ని రోజులు దూరమయ్యాడు. ఏకంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికేసి కామెంటేటర్‌గా కొనసాగే వరకు వచ్చేశాడు. కానీ.. తన రెండో భార్య దీపకా ప్రొత్సాహంతో మళ్లీ ఆటపై దృష్టిపెట్టిన కార్తీక్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫినిషర్‌గా దుమ్మురేపాడు. దీంతో 37 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి వచ్చాడు.
ఐపీఎల్ 2022 కంటే ముందే 2018లో నిధాస్ ట్రోఫీలో దినేష్‌కార్తీక్ తనలోని ఫినిషర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అలాగే ధోని రిటైర్మెంట్‌తో టీమిండియాలో కూడా ఫినిషర్ లేని లోటు ఏర్పడింది. దీంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా లాభంలేదని.. ఫినిషర్ రోల్‌పై ఫోకస్‌పెట్టిన కార్తీక్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు ఆడిన దినేష్ కార్తీక్ ఫినిషర్‌గా అదరగొట్టాడు. దీంతో డీకేను జాతీయ జట్టులోకి తీసుకోకతప్పలేదు. నేరుగా టీ20 వరల్డ్ కప్‌కే కాకుండా.. డీకేను ఇటివల వెస్టిండీస్ సిరీస్‌కు, ఆసియా కప్ 2022కు సైతం ఎంపిక చేశారు. వీటిలో తక్కువ అవకాశాలే వచ్చినా.. వాటిని వినియోగించుకున్నాడు. జట్టులో రిషభ్ పంత్ లాంటి రెగ్యులర్ వికెట్ కీపర్ ఉన్నా.. సెలెక్టెర్లు డీకేను రెండో కీపర్ కమ్ ఫినిషర్‌గా జట్టులోకి తీసుకున్నారు. డీకే ఎంపికపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ తన ట్విట్టర్ అకౌంట్‌లో డీకే టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌కు డీకే ఎంతో ప్రత్యేకంగా స్పందించాడు. ‘నా ప్రయాణంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించి.. మీరే నా కల నిజం చేశారు. ముఖ్యంగా నేను టీమిండియాకు ఆడుతున్నా.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ ఫ్యాన్స్ నన్ను ప్రొత్సహించిన అభిమానులుకు నా కృతజ్ఞతలు’ అంటూ డీకే రీట్విట్ చేశాడు. ప్రస్తుతం డీకే ట్వీట్ వైరల్‌గా మారింది. నిజానికి ముగిసిపోతున్న డీకే కెరీర్‌కు ఒక విధంగా ఆర్సీబీ ప్రాణం పోసిందని చెప్పాలి. ఆర్సీబీ ఐపీఎల్ 2022 సీజన్‌లో డీకేను కొనుగోలు చేయకపోయినా.. అతన్ని ఫినిషర్ స్థానంలో ఆడించకపోయినా.. ప్రస్తుతం డీకే టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక అయ్యేవాడు కాదు. ఈ విషయం అందరికంటే డీకే బాగా తెలుసు. అందుకే.. ఆర్సీబీ ట్వీట్‌కు డీకే ప్రత్యేకంగా స్పందించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: షార్జా గ్రౌండ్‌లో మన ఆటగాళ్ల సంబరాలు! దీని వెనుక పెద్ద కథే ఉంది!
Thanks @RCBTweets for bein an integral part of the journey and helping me achieve my dream
Most importantly to all the RCB fans who chant RCB,RCB even when am in my blues representing team INDIA , I LOVE YOU GUYS.
THANKS @malolanr @CoachHesson SANJAY BANGAR @basu2013 S SRIRAM https://t.co/eAmSK08SeA
— DK (@DineshKarthik) September 14, 2022