David Warner, Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 టీచర్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటే.. క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటాడు. ఈ స్టార్ బ్యాటర్ ఒకప్పుడు సన్ రైజర్స్ సారథిగా ఉన్న సంగతి తెలిసిందే. కెప్టెన్ గా, బ్యాటర్ గా ఆకట్టుకొని తెలుగు క్రికెట్ అభిమానులకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తెలుగు పాటలకు డ్యాన్స్ లు వేస్తూ అప్పట్లో తెగ సందడి చేసేవాడు. మహేష్, అల్లు అర్జున్ పాటలకు స్టెప్పులేస్తూ అభిమానులని ఖుషి చేసాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురంలో” సినిమాలోని “బుట్ట బొమ్మ” సాంగ్ కి వార్నర్ చేసిన డ్యాన్స్ బాగా పాపులర్ అయింది. ఇటీవలే పుష్ప సినిమాలోని “తగ్గేదేలే” అనే డైలాగ్ ని అల్లు అర్జున్ మ్యానరిజంతో చెప్పి తెలుగు వారికి మరింతగా చేరువయ్యాడు. తాజాగా.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
ఏప్రిల్ 8న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ క్రమంలో సినీ ప్రముఖలతో పాటుగా అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ సైతం ఐకాన్ స్టార్ కి విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం వార్నర్ హైదరాబాద్ జట్టులో లేకపోయినా.. ఇలా బన్నీకి శుభాకాంక్షలు చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “బిగ్ షౌటౌట్, బిగ్ మ్యాన్.. అల్లు అర్జున్ హ్యాపీ బర్త్ డే మేట్. పుష్ప-2 కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం”. అని చెప్పాడు. ఇక వార్నర్ తో పాటు కూతురు ఇస్లా కూడా హ్యాపీ బర్త్ డే పుష్ప అంటూ చాలా క్యూట్‌గా చెప్పింది. వార్నర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప-2 తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా.. దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరో వైపు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మొత్తానికి ఆస్ట్రేలియన్ స్టార్.. ఐకాన్ స్టార్ కి శుభాకాంక్షలు తెలియజేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.