భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎవరు ఆడాలో నిర్ణయించే కీలక స్థానంలో ఉండి.. ఆఫ్ ది రికార్డు అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయారు. మరి ఆయన ఈ స్థానానికి ఎలా వచ్చారు. సెలెక్టర్ అవ్వడానికి ముందు ఆయన టీమిండియాకు చేసిన సేవలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చేతన్ శర్మ ఒక్క వీడియోతో ఇండియన్ క్రికెట్‌లో పెను దుమారం రేపారు. ప్రస్తుతం భారత జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ఆయన.. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు. దీంతో ప్రస్తుతం ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. మంగళవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఆయనపై జరిపిన స్టింగ్ ఆపరేషన్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియాలో కోహ్లీ-గంగూలీ మధ్య వివాదం, కోహ్లీ కెప్టెన్సీ వివాదం, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలకు కెప్టెన్సీ ఇవ్వడం, భారత క్రికెటర్లు ఫిట్‌నెస్ కోసం డోపింగ్‌కు దొరకని ఇంజెక్షన్లు వాడతారంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేశారు. ఈ విషయమై ఆయనపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే.. భారత జాతీయ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నత స్థానంలో ఉండి.. ఇలా ఒక స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీంతో.. క్రికెట్ అభిమానులు అసలు ఎవరీ చేతన్ శర్మ అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరి చేతన్ శర్మ ఎవరూ? సెలెక్టర్ కాకముందు ఆయన ఏం చేసేవారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1983 డిసెంబర్ 7న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన చేతన్ శర్మ.. తన 17వ ఏటనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. కుడిచేతి వాటం స్పీడ్ బౌలర్ అయిన చేతన్.. వన్డేల్లోకి అడుగుపెట్టిన ఏడాది తర్వాత 1984 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌లోనే పాక్ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో.. టెస్టు క్రికెట్‌లో ఆడిన తొలి మ్యాచ్ తొలి ఓవర్‌లనే వికెట్ తీసిన మూడో ఇండియన్ క్రికెటర్‌గా చేతన్ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత చాలా కాలం టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు బౌలింగ్ పార్ట్నర్‌గా ఉన్నారు. 1985లో శ్రీలంకలో మూడు టెస్టుల్లో 14 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 1986లో ఇంగ్లండ్‌లో రెండు టెస్టుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు ప్రదర్శనలు చేతన్ కెరీర్‌లో గొప్ప ప్రదర్శనలుగా చెప్పుకోవచ్చు. అలాగే.. ఇంగ్లండ్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల హాల్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ బౌలర్ చేతన్ శర్మనే. అలాగే 1985లో ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా చేతన్ సెంచరీ చేసి అదరగొట్టారు. అలాగే 1987 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై చేతన్ హ్యాట్రిక్ సాధించారు. వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్ కూడా చేతన్ శర్మనే.
చేతన్.. 1994-95 మధ్య వరకు వన్డేలు ఆడుతున్నా.. టెస్టుల్లో కెరీర్‌కు మాత్రం 1989లోనే పుల్‌స్టాప్ పడింది. తన కెరీర్‌లో 23 టెస్టులు ఆడిన చేతన్.. 61 వికెట్లు పడగొట్టారు. అందులో 5 వికెట్ల హాల్ 4 సార్లు, 10 వికెట్ల హాల్ ఒక సారి సాధించారు. అలాగే 396 రన్స్ చేశారు. 65 వన్డేలు ఆడి.. 67 వికెట్ల తీసుకున్నారు. 456 పరుగులు చేశారు.. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన రత్వాత చేతన్ శర్మ చాలా కాలం పాటు క్రికెట్ కామెంటేటర్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. 2009లో మాత్రం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. హర్యానాలో బీఎస్పీ(బహుజన సమాజ్ పార్టీ)లో చేరారు. ఆ రత్వాత 2019లో బీఎస్పీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2020లో భారత జాతీయ సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కాగా.. 2022 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వైఫల్యం కారణంగా.. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా తొలగించబడ్డారు. కానీ.. మళ్లీ ఆయననే చీఫ్ సెలెక్టర్‌గా బీసీసీఐ నియమించింది. మరి ఇప్పుడు ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోతో చీఫ్ సెలెక్టర్‌గా చేతన్ కెరీర్ ముగిసిపోయేలా ఉంది. మరి చేతన్ కెరీర్‌పై అలాగే ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We Stand With Chetan Sharma pic.twitter.com/Og0SE9QcpZ
— ً (@Ro45Goat) February 14, 2023
Hey Virat Fans this is for you.
It was a Selection committee decision to remove Virat from ODI captaincy Ganguly was not involved in it. We just did not want to have 2 white ball captains.
Stop blaming Dada… #SouravGanguly #ViratKohli#ChetanSharma #BCCI #GameOver#zeenews pic.twitter.com/r7ItonBAkp— Pambi Praveen Kumar (@PraveenPKBRS) February 15, 2023