కొన్ని రోజులు క్రితం క్రికెట్ ప్రపంచాన్ని తన బజ్ బాల్ స్ట్రాటజీతో ఆశ్చర్యానికి గురిచేసింది ఇంగ్లాండ్ టీమ్. అయితే గత కొన్ని మ్యాచ్ ల్లో మాత్రం తన బజ్ బాల్ లెక్క తప్పుతున్నట్లు కనిపిస్తోంది. మెున్న కివీస్ పై ఒక్క పరుగు తేడాతో టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్.. తాజాగా బంగ్లాదేశ్ పై 50 పరుగుల తేడాతో మూడో వన్డేలో పరాజయం పాలైంది.
కొన్ని రోజులు క్రితం క్రికెట్ ప్రపంచాన్ని తన బజ్ బాల్ స్ట్రాటజీతో ఆశ్చర్యానికి గురిచేసింది ఇంగ్లాండ్ టీమ్. పాకిస్థాన్ తో మెుదలైన ఇంగ్లాండ్ బజ్ బాల్ జైత్ర యాత్ర న్యూజిలాండ్ పై కూడా చూపించింది. అయితే కివీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో మాత్రం తన స్ట్రాటజీని కాపాడుకోలేకపోయింది. ఆ టెస్ట్ లో కివీస్ చేతిలో ఒక్క పరుగుతో ఓడిపోయి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఇదే తీరును బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో మాత్రం తన బజ్ బాల్ క్రికెట్ ప్రభావాన్ని చూపలేకపోయింది.తాజాగా బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో 50 పరుగులతో పరాజయం పాలైంది ఇంగ్లాండ్.
“బజ్ బాల్ క్రికెట్ తో టెస్ట్ క్రికెట్ ను అభిమానులు ఎగబడి చూసేలా చేస్తాం” పాక్ పర్యటనకు ముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. అయితే ఆ టెస్ట్ సిరీస్ లో నిజంగానే వారు చెప్పినట్లుగానే చేసి చూపించారు. వారు ఆడేది టెస్ట్ మ్యాచ్ హా.. లేదా టీ20 నా అన్న అనుమానం కూడా అభిమానులకు కలిగింది. ఇదే తీరును అనంతరం కివీస్ పై కూడా ప్రయోగించింది. కానీ అక్కడ తొలి టెస్ట్ లో వారి ప్రయోగం సక్సె స్ అయ్యింది, రెండో టెస్ట్ లో మాత్రం వారి బజ్ బాల్ స్ట్రాటజీ దెబ్బకొట్టింది. దాంతో ఆ టెస్ట్ లో పరుగు తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయి.. విమర్శల పాలైంది.
ఈ క్రమంలోనే తాజాగా బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే ఈ వన్డే సిరీస్ లో గమనించాల్సిన విషయం ఏంటంటే? గత టీమ్ లపై ప్రయోగించిన బజ్ బాల్ క్రికెట్ స్ట్రాటజీని బంగ్లా సమర్థవంతగా నిలువరించింది. సిరీస్ అయితే కోల్పోయింది గానీ, మూడు వన్డేల్లో ఇంగ్లాండ్ కు గట్టిపోటీనే ఇచ్చింది. ఇక తాజాగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది బంగ్లా జట్టు. దాంతో ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ స్ట్రాటజీ లెక్కతప్పుతోంది అన్న విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో షాంటో(53), ముష్ఫికర్ రహీమ్ (70), షకీబ్ (75) పరుగులతో రాణించారు. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. బంగ్లా బౌలర్ల ధాటికి 43.1 ఓవర్లలో 196 పరుగులకే కుప్పకూలింది. జట్టులో జేమ్స్ విన్సే చేసిన 38 పరుగులే టాప్ స్కోర్ గా నిలిచింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. తైజుల్ ఇస్లాం, హుస్సేన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయ్యడం ద్వారా వన్డేల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్ లో షకీబ్ చేరాడు. మరి లెక్కతప్పుతున్న ఇంగ్లాండ్ బజ్ బాల్ క్రికెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shakib Al Hasan: An all-format🐐 for 🇧🇩#BANvENG | @Sah75official pic.twitter.com/3B0vg2DZQm
— CricTracker (@Cricketracker) March 6, 2023