ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్లకు భారీ షాక్ తగిలింది. స్వదేశంలో ఇంగ్లాండుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో చిత్తుగా ఓడింది. పెర్త్‌లో ముగిసిన తొలి టీ20 లో ఓడిన ఆసీస్.. కాన్‌బెర్రా వేదికగా జరిగిన రెండో మ్యాచులోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. ఫలితంగా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 0-2తో కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 178 పరుగులు చేయగా, అనంతరం ఆసీస్ జట్టు 170 పరుగులకే పరిమితమయ్యింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచులో డేవిడ్ వార్నర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వివరాలు..
ఇంగ్లాండ్ బ్యాటింగ్ 15వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్, మోయిన్ అలీ కొట్టిన బంతిని అంచనా వేయడంలో తడబడ్డాడు. బౌండరీ లైన్ అవతల పడుతుందనంగా గాల్లోకి ఎగిరాడు. దీంతో పట్టు తప్పి తల బలంగా భూమికి తాకింది. దీంతో వార్నర్ వెంటనే మైదానాన్ని వీడాడు. ఆపై.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో అతడు బ్యాటింగ్ చేసినప్పటికీ.. గాయం తీవ్రత ఎక్కువుగా ఉన్నట్లు సమాచారం. స్కానింగ్ రిపోర్టులు వచ్చాక క్రికెట్ ఆస్ట్రేలియా పూర్తి వివరాలను వెల్లడించనుంది. దీంతో వరం రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్ లో ఆడటం అనుమానమే అన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే.. వరుస ఓటములతో తల ఎత్తుకోలేక పోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ వార్నర్ దూరమైతే.. ఆ లోటును భర్తీచేయడం కష్టమే.
David Warner is off the ground and being checked out after landing heavily attempting this catch #AUSvENG pic.twitter.com/mDKDsJBhte
— cricket.com.au (@cricketcomau) October 12, 2022
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు, డేవిడ్ మలన్(82; 49 బంతుల్లో, 7 ఫోర్లు, 4 సిక్సులు), మోయిన్ అలీ(44; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టోయినీస్ 3 వికెట్లు తీయగా, జంపా 2, కమ్మిన్స్ 1, స్టార్క్ 1 వికెట్ తో రాణించారు. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 20 ఓవర్లలో 170 పరుగులకే పరిమితమయ్యింది. మిచెల్ మార్ష్(45; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్(0; 23 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. కాగా, ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.
Two identical margins of victory – England have the momentum ahead of the T20 World Cup 👊 #AUSvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2022