టీ20 ప్రపంచ కప్ ముంగిట ఆస్ట్రేలియాకు దారుణ ఓటమి ఎదురైంది. స్వదేశంలో ఇంగ్లాండుతో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయింది. తొలి టీ20లో ఓటమిపాలైన ఆతిథ్య జట్టు.. రెండో టీ20లోనూ అదే ఆటతీరును ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో178 పరుగులు చేయగా, అనంతరం ఆసీస్ జట్టు 170 పరుగులకే పరిమితమయ్యింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ క్రికెటర్ ‘బెన్ స్టోక్స్’ చేసిన ఫీల్డింగ్ విన్యాసాలు.. మ్యాచుకే హైలైట్ గా నిలిచాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
టీ20 ప్రపంచ కప్ ముంగిట ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు, రెండో టీ20లోను అదే రిపీట్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు, డేవిడ్ మలన్(82; 49 బంతుల్లో, 7 ఫోర్లు, 4 సిక్సులు), మోయిన్ అలీ(44; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టోయినీస్ 3 వికెట్లు తీయగా, జంపా 2, కమ్మిన్స్ 1, స్టార్క్ 1 వికెట్ తో రాణించారు. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 20 ఓవర్లలో 170 పరుగులకే పరిమితమయ్యింది. మిచెల్ మార్ష్(45; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్(0; 23 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.
That is illegal Ben, you are not allowed to do that
Warning! Do not try this at your Home!!!#BenStokes #CricketTwitter #OneCricket #AUSvENGpic.twitter.com/4m87Sae2Sb
— OneCricket (@OneCricketApp) October 12, 2022
ఈ మ్యాచులో విజయం కోసం ఇరుజట్లు ఆఖరిదాకా పోరాడాయి. అయితే.. ఫీల్డింగ్ అద్భుతంగా చేసిన ఇంగ్లాండునే విజయం వరించింది. ముఖ్యంగా ‘బెన్ స్టోక్స్’ చేసిన ఫీల్డింగ్ విన్యాసాలు.. మ్యాచుకే హైలైట్ గా నిలిచాయి. సిక్స్ పోయిందనుకున్న బాల్ ను.. స్టోక్స్ తన జిమ్నాస్టిక్స్ విన్యాసాలతో రెండు పరుగులకే పరిమితం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘స్టోక్స్.. ఇలాంటి విన్యాసాలు నీకే సాధ్యమంటూ..’ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.
England win the series with one game to spare against defending World Cup champions Australia.#AUSvENG pic.twitter.com/erCMj66jtJ
— CricTracker (@Cricketracker) October 12, 2022