ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో బాబర్ అజమ్ ముందు వరుసలో ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బాబర, వన్డే ర్యాకింగ్స్‌లో నంబర్ వన్‌గా కొనసాగతున్నాడు. కానీ.. ఆసియా కప్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. పవర్‌ప్లేలోనే వికెట్ పారేసుకుంటూ ఫామ్ కోల్పోతున్నాడు. ఆసియా కప్ ప్రారంభానికి ముందు భీకర ఫామ్‌లో ఉన్న బాబర్.. ఆసియా కప్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియా కప్ 2022లో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 పరుగులు చేసిన బాబర్, తర్వాత హాంకాంగ్‌పై కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మళ్లీ సూపర్ ఫోర్‌లో టీమిండియాపై 14 పరుగులు చేసి వికెట్ ఇచ్చాడు. తాజాగా బుధవారం అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా గోల్డెన్ డక్ అయ్యాడు. ఇప్పటి వరకు ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన బాబర్ చేసిన పరుగులు మొత్తం 33 మాత్రమే. ఈ పరుగులు బాబర్ బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
కాగా.. ఆసియా కప్‌కు ముందు ఫామ్‌లో లేక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శల పాలయ్యాడు. కానీ.. ఆసియా కప్‌తో అతను ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు సాధించిన కోహ్లీ.. అఫ్ఘనిస్థాన్‌పై సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సులతో 122 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఆసియా కప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆసియా కప్‌కు ముందు ఫామ్‌లోని లేని కోహ్లీ ఫామ్‌లోకి రావడం, ఆసియా కప్‌కు ముందు ఫామ్‌లో ఉన్న బాబర్ అజమ్ ఫామ్ కోల్పోవడం యాదృశ్చికమే అయినా.. క్రికెట్ ఫ్యాన్స్ ఈ విషయంపై డిఫరెంట్ స్పందిస్తున్నారు. ఆసియా కప్‌లో ఇండియా తమ తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే ఆడింది. అలాగే పాక్ కూడా ఇండియాతోనే ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు ఇండియా-పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో సరదాగా కలిసి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కోహ్లీ-బాబర్ కూడా కలిసి షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకుని పరస్పరం పలకరించుకున్నారు.
ఇలా ఈ ఇద్దరూ ఆటగాళ్లు కలిసిన వేళ విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫామ్ దరిద్రం బాబర్ అజమ్‌కు చుట్టుకుందని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా పేర్కొంటున్నారు. అందుకే అప్పటి వరకు ఫామ్‌లో ఉన్న బాబర్ సడెన్‌గా ఫామ్ కోల్పోయాడని అంటున్నారు. బాబర్ ఇదే బ్యాడ్ ఫామ్‌ను కొనసాగిస్తే.. ఫైనల్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో పాక్‌కు ఇబ్బందులు తప్పవని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రతిసారి రిజ్వాన్ పాక్‌ను కాపడలేడనే విషయం బుధవారం ఆఫ్ఘాన్ మ్యాచ్‌తో అర్థమైంది. కాగా.. ఇప్పటికే టీమిండియా ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. దీంతో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశం లేదు. మళ్లీ తిరిగి అక్టోబర్‌లో ప్రారంభ అయ్యే టీ20 వరల్డ్ కప్ వేదికగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. గురువారం ఇండియా-అఫ్ఘనిస్థాన్ నామమాత్రపు మ్యాచ్ ఆడి ఆసియా కప్ నుంచి స్వదేశాలకు చేరనున్నాయి. మరి కోహ్లీ ఫామ్‌లోకి రావడం, బాబర్ ఫామ్ కోల్పోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కింగ్ కోహ్లీ సెంచరీ చేస్తే రికార్డుల వర్షమే! 1 కాదు, 2 కాదు.. ఏకంగా 12 రికార్డులు
Transferred his bad form to Babar Azam, while getting good form from him.
Masterstroke strategy!
King Virat Kohli! 🔥 pic.twitter.com/rnNkLurMiP— Keh Ke Peheno (@coolfunnytshirt) September 2, 2022
Babar Azam after shaking hands with Virat Kohli. pic.twitter.com/0my9me3YW0
— Sai Teja (@csaitheja) September 4, 2022
Babar’s father to Virat Kohlipic.twitter.com/s7K1s4GlAE
— الکاظمی (@abdur_rehman26) September 4, 2022