క్రీడాభిమానులు రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వాళ్లు. మంచిగా ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు.. పొరపాటున అతడి వల్లే మ్యాచ్ ఓడిపోతే మాత్రం దారుణంగా తిడతారు. అదీ కాక ట్రోల్స్ ఉండనే ఉన్నాయి. ఈ విషయం టీమిండియా బౌలర్ అయిన అర్షదీప్ సింగ్ కు ఈ మధ్యే తెలిసి వచ్చింది. పాక్ తో మ్యాచ్ లో సింపుల్ క్యాచ్ వదిలేసి.. టీమిండియా ఓటమికి కారణం అయ్యాడని అతడిని దారుణంగా విమర్శించారు. ఆ విమర్శలకు తాజాగా తన బంతితోనే సమాధానం ఇచ్చాడు అర్షదీప్. పడ్డ చేటే నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టి అందరి నోళ్లు మూయించాడు. ఇక క్యాచ్ పట్టాక అతడు తొడ కొట్టిన విధానం గబ్బర్ శిఖర్ ధావన్ ను గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
శిఖర్ ధావన్.. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్. మైదానంలో ఎంత ఉత్సాహంగా ఉంటాడో.. బయటా అంతే జోష్ లో ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు.. తనదైన డ్యాన్స్ లతో అభిమానులకు కనులవిందు చేస్తాడు. ఇక ధావన్ క్యాచ్ పడితే.. తొడ కొట్టి మీసం మెలేస్తాడు.. అది అతడి సిగ్నేచర్ స్టెప్. ధావన్ అలా చేసినప్పుడల్లా అభిమానులు మురిసిపోతుంటారు. మరి తాజాగా అలాంటి స్టెప్ నే మరో టీమిండియా ఆటగాడు అనుకరిస్తే.. అనుకరిస్తే కాదు.. చేసి చూపించాడు కూడా. ఎవరనుకుంటున్నారా? నిన్న మెున్నటి దాకా పాక్ తో మ్యాచ్ లో సింపుల్ క్యాచ్ వదిలేసి విమర్శల పాలైన అర్షదీప్ సింగే. అవును తాజాగా జరిగిన సౌతాఫ్రికా మ్యాచ్ లో డైవ్ చేస్తూ.. అద్భుతమైన క్యాచ్ పట్టి అందర్ని ఆశ్యర్యపరిచాడు. దీపక్ చహర్ బౌలింగ్ లో సౌతాఫ్రికా యువ సంచలనం ట్రిస్టన్ స్టబ్స్ కొట్టిన బంతిని అర్షదీప్ డైవ్ చేస్తూ గొప్ప క్యాచ్ పట్టాడు. ఇక క్యాచ్ పట్టిన తర్వాత అచ్చం శిఖర్ ధావన్ తొడ కొట్టినట్లే.. తొడ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో చూసిన ధావన్ అభిమానులు..”మా గబ్బర్ ను మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు” అంటూ అర్షదీప్ ను ప్రశంసిస్తున్నారు. మరికొంత మంది స్పందిస్తూ..”సింగ్ ఈజ్ కింగ్.. పడ్డ చోటే నిలబడ్డావు”, ఈ క్యాచ్ పట్టి అందరి నోర్లు మూయించావ్” అంటూ రాసుకొచ్చారు. అయితే ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ బ్యాటర్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను అర్షదీప్ సింగ్ జారవిడిచాడు. దాంతో మ్యాచ్ పాకిస్థాన్ మ్యాచ్ గెలిచింది. ఇక అప్పటి నుంచి అతడిపై ట్రోల్స్ మెుదలైయ్యయి. అవి ఎంతలా అంటే? చివరికి అతడి వికీపీడియా లో ఖలిస్థాన్ అని పేరును కూడా పెట్టేంతగా.. ట్రోల్స్ చేశారు. ఈ విషయంపై కేంద్రం సీరియస్ గా స్పందించి వికీపీడియకు సమన్లను కూడా జారీ చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఇన్ని విమర్శల నేపథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన అర్షదీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. క్యాచ్ పట్టి తొడ కొట్టి తనపై విమర్శలు చేసిన వారికి సూపర్ పంచ్ ఇచ్చాడు.
— Hardin (@hardintessa143) September 29, 2022