భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఎంత ఫైర్ ఉంటుందో.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఒకరిపై ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకోవడం.. వాటికి ఇరు దేశాల క్రికెట్ అభిమానులు కౌంటర్లు వేయడం కామన్. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ ఉన్నా.. లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం జరుగుతూనే ఉంటుంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రిటైర్మెంట్ టైమ్ వచ్చిందంటూ పాక్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షాహీద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శుభమా అంటూ ఆసియా కప్ 2022తో తన పూర్వవైభవాన్ని అందుకున్న విరాట్ కోహ్లీకి ఒక స్టార్ మాజీ క్రికెటర్‌గా నువ్వు ఇచ్చే తొక్కలో సలహా ఇదా అంటూ క్రికెట్ అభిమానులంతా అఫ్రిదీపై మండిపడ్డారు.
ఆసియా కప్ 2022కు ముందు కోహ్లీ పరుగులు చేస్తున్నా.. అవి తన స్థాయికి తగ్గట్లు లేవంటూ, సెంచరీ చేస్తేనే కింగ్ కోహ్లీ అన్నట్లు విమర్శలు వచ్చాయి. కోహ్లీ కూడా 71వ సెంచరీ కోసం తీవ్రంగా శ్రమించాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తొలి సారి ఆరు వారాల సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్‌తో తిరిగి బరిలోకి దిగాడు. అంతే మళ్లీ పాత కోహ్లీని చూపించాడు. రెండు హాఫ్ సెంచరీలు ఒక అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. దీంతో కింగ్ కోహ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ క్రికెట్ ప్రపంచ మొత్తం సంబురాలు చేసుకుంది. కానీ.. పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదీ మాత్రం అపశకునం పలుకుతూ.. కోహ్లీ ఇక క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించాడు. అఫ్రిదీ ఇచ్చిన ఉచిత సలహా కోహ్లీ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో అఫ్రిదీ వ్యాఖ్యలను దారుణంగా వ్యతిరేకించారు.
ఇక ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా సైతం స్పందిస్తూ అఫ్రిదీని దారుణంగా ట్రోల్ చేశాడు. విరాట్ కోహ్లీ విషయంలో అఫ్రిదీ చేసిన వ్యాఖ్యల కంటే అఫ్రిదీకి మిశ్రా ఇచ్చిన కౌంటర్ హైలెట్‌గా నిలిచింది. ‘డియర్ అఫ్రిదీ! కొంతమంది ఒక్కసారి మాత్రమే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. అందుకని ఈ విషయంలో కోహ్లీని దూరంగా ఉంచడం మంచిది’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మిశ్రా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమిత్ మిశ్రా అలా ఎందుకు ట్వీట్ చేశాడంటే.. షాహీద్ అఫ్రిదీ అనేక సార్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్నాడు. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. నీలా కొంతమంది పది పది సార్లు రిటైర్మెంట్ ప్రకటించరు.. జీవితంలో ఒక్కసారే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. అందుకే కోహ్లీ రిటైర్మెంట్ గురించి మీరు భయపడకండి అంటూ సుతిమెత్తగా చురకలు అంటించాడు. మరి అఫ్రిదీకి అమిత్ మిశ్రా ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 9వ తరగతి ఫిజిక్స్‌లో పాఠ్యాంశంగా పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాటింగ్ టెక్నిక్
Dear Afridi, some people retire only once so please spare Virat Kohli from all this. 🙏🏽 https://t.co/PHlH1PJh2r
— Amit Mishra (@MishiAmit) September 13, 2022