ఆసియా కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. పటిష్టమైన ఇండియా, పాకిస్థాన్ లాంటి జట్లను ఓడించి టైటిల్ గెలిచింది. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ 2022లో గ్రూప్ స్టేజ్‌లో నమీబియా చేతిలో ఓడి.. అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత కోలుకుని ఎలాగోలా సూపర్ 12కు చేరి.. అక్కడితో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జట్టు సభ్యుడు గుణతిలక రేప్ కేసులో అరెస్ట్ అవ్వడం, మరో ఆటగాడు కరుణరత్నేపై నిషేధంతో లంక జట్టులో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న శ్రీలంక జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ భారీ షాక్ ఇచ్చింది. టీ20 లాంటి ఫాస్ట్‌ఫుడ్ ఫార్మాట్‌లో అఫ్ఘాన్.. శ్రీలంకను ఓడించిందంటే పెద్ద విశేషం కాదు కానీ.. వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన అఫ్ఘాన్.. లంకను చిత్తు చేసింది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందూ హసరంగా బ్యాట్, బాల్‌తో పోరాడినా.. అఫ్ఘాన్ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్.. పల్లెకెలె వేదికగా.. తొలి వన్డేలో లంకకు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్ఘాన్ టాపార్డర్ అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు గుర్బాన్, ఇబ్రహీమ్ జద్రాన్ తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని అందించారు. గుర్బాజ్ 55 బంతుల్లో 9 ఫోర్లతో 53 పరుగులు చేసి హసరంగాకు చిక్కాడు. మరో ఓపెనర్ జద్రాన్ మాత్రం సెంచరీతో చెలరేగాడు. 120 బంతుల్లో 11 ఫోర్లతో 106 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఆ తర్వాత రెహమత్ 52, నజీబుల్లా సైతం 42 పరుగులతో రాణించారు. దీంతో అఫ్ఘాన్ శ్రీలంక ఎదుట భారీ టార్గెట్ ఉంచగలిగింది. లంక బౌలర్లలో హసరంగా 2 వికెట్లతో రాణించాడు.
భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకను ఫజల్‌హక్ ఫారుఖీ, అహ్మెద్‌జాయ్ ఆరంభంలోనే చావుదెబ్బ కొట్టారు. ఓపెనర్ కుషల్ మెండిస్‌ను అహ్మెద్ జాయ్, వన్‌డౌన్‌లో వచ్చిన దినేష్ చండిమాల్‌ను ఫారుఖీ పెవిలియన్ చేర్చారు. మరో ఓపెనర్ నిస్సంకా 85 పరుగులతో ఒంటరిపోరాటం చేసినా.. మరో ఎండ్ నుంచి ఎవరూ సపోర్ట్ ఇవ్వకపోవడంతో లంక ఓటమి దిశగా సాగింది. వచ్చిన వారు వచ్చినట్లే 10, 16 పరుగులు చేస్తూ.. అవుట్ అవ్వడంతో నిస్సంకా కూడా నిస్సహయంగా మిగిలిపోయాడు. కానీ.. చివర్లో హసరంగా మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 46 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులతో పోరాడినా.. అప్పటికే ఛేదించాల్సిన లక్ష్యం పెద్దదైపోయింది. 38 ఓవర్లలో 234 పరుగులకు లంక ఆలౌట్ అయింది. సంచలనం సృష్టిస్తూ.. ఆఫ్ఘనిస్థాన్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో వన్డేల్లో కూడా అఫ్ఘాన్‌ను తక్కువ అంచనా వేయకూడదనే విషయం ప్రపంచ క్రికెట్‌కు తెలిసొచ్చింది.
PLAYER OF THE MATCH 🎖️
1️⃣0️⃣6️⃣ runs 👏
1️⃣2️⃣0️⃣ balls
1️⃣1️⃣ boundariesAnother day, another fantastic performance from @IZadran18! 🤩#AfghanAtalan | #CWCSL | #AFGvSL | #SuperCola | #KamAir pic.twitter.com/N7qVMeqnf8
— Afghanistan Cricket Board (@ACBofficials) November 25, 2022
WHAT A WIN FOR AFGHANISTAN! 🙌#AfghanAtalan put on a clinical all-round performance as they backed up a disciplined batting performance with a superb bowling effort to beat @OfficialSLC by 60 runs in the 1st game and take a 1-0 lead in the three-match ODI series. #AFGvSL pic.twitter.com/yetWIF8qL0
— Afghanistan Cricket Board (@ACBofficials) November 25, 2022