ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ కొట్టిన సిక్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రీన్ బౌలింగ్‌లో మేయర్స్ స్వీపర్ కవర్స్ మీదుగా కొట్టిన పంచ్ సిక్స్ అటు సోషల్ మీడియాను, ఇటు క్రికెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది. 105 మీటర్ల దూరమెళ్లిన ఈ సిక్స్‌ను అందరూ ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’ అని కొనియాడుతున్నారు. ఇదే స్టయిల్లో 9 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.
వెస్టిండీస్ ప్లేయర్స్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో భారీ సిక్సులు బాదడంలోవాళ్లది ప్రత్యేక శైలి. క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రస్సెల్, రకీమ్ కార్న్ వాల్, కార్లోస్ బ్రాత్‌వైట్, షిమ్రాన్ హెట్మేయర్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్ లాంటి ఆటగాళ్లు భారీ సిక్సులు బాదగలరు. అయితే వీరందరిలో కైల్ మేయర్స్ కాస్త భిన్నంగా సిక్సులు బాదగలడు. తాజాగా ఇలాంటి ఘటనే నిన్న ఆస్ట్రేలియా గడ్డపై చోటుచేసుకుంది. బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో కామెరాన్ గ్రీన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని.. మేయర్స్ కవర్ వైపుగా భారీ షాట్ ఆడాడు.
WOW!
Incredible six from Mayers – over cover! #AUSvWI pic.twitter.com/xBEaPYgFzN
— cricket.com.au (@cricketcomau) October 5, 2022
143 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి.. మేయర్స్ ఆడిన విధానంకు 105 మీటర్ల దూరంలో పడింది. ఈ సిక్స్‌ను అందరూ ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’ అని కొనియాడుతున్నారు. అయితే.. ఈ షాట్‌ను విరాట్ కోహ్లీ 9 ఏళ్ల క్రితమే క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. అది కూడా వెస్టిండీస్ జట్టుపైనే. ఈ షాట్ ఆడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్ళింది. అక్టోబర్ 23న దాయాధి పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది.
When Virat Kohli played similar shot like Kyle Mayers 9 years ago. pic.twitter.com/5Bwdkj1Nb0
— Out of context Virat Kohli (@KohliArchives) October 6, 2022