ఐపీఎల్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన స్టార్ క్రికెటర్ సందీస్ లామిచానేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్‌కు చెందిన ఈ క్రికెటర్‌పై మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం నేపాల్‌లో అడుగుపెట్టగానే.. ఖట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందీప్‌ను నేపాల్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. తనపై 22 ఏళ్ల సందీప్ లామిచానే ఖంట్మాడులోని ఒక హోటల్ గదిలో రేప్ చేశాడని 17 ఏళ్ల బాలిక ఆగస్టులో మీడియాకు వెల్లడించింది. ఆ సమయంలో సందీప్ నేపాల్ నేషనల్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది.
ఆ సమయంలో సందీప్ వెస్టిండీస్‌లో కరేబియన్ లీగ్‌లో ఆడుతున్న క్రమంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. కానీ.. సెప్టెంబర్ 8న సందీప్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ.. కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. సందీప్‌ను అదుపులోకి తీసుకునేందుకు.. ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటామని నేపాల్ పోలీసులు ప్రకటించగానే.. సందీప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఈ కేసు విచారణ కోసం తాను నేపాల్ వస్తానని ప్రకటించాడు. కానీ.. తనపై వచ్చిన ఆరోపణలను మాత్రం సందీప్ ఖండించాడు. తాను ఎలాంటి తప్పుడు పనికి పాల్పడలేదని తోసిపుచ్చాడు.
చాలా కాలంగా నేపాల్ రాకుండా విదేశాల్లోనే ఉంటున్న సందీప్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతోనే అతను నేపాల్ తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. సందీప్ వస్తున్నాడనే విషయం తెలుసుకున్న నేపాల్ పోలీసులు అతన్ని ఇంటికి కూడా వెళ్లే అవకాశం ఇవ్వకుండా.. విమానం దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరి విచారణ ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయో చూడాలి. కాగా.. సందీప్‌ను 2018 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతను పలు విదేశీ లీగ్స్‌లో ఆడుతున్నాడు. ఈ రేప్ ఆరోపణలు వచ్చిన తర్వాత.. అతన్ని నేపాల్ జాతీయ జట్టు కెప్టెన్‌గా తొలగించారు.
— Sandeep Lamichhane (@Sandeep25) September 9, 2022
Nepal | Former Nepali National team captain Sandeep Lamichhane, accused of raping a minor, arrested & taken into custody by police at Tribhuwan International Airport in Kathmandu https://t.co/IRkjcPPPvb pic.twitter.com/xF4f1LK0Ol
— ANI (@ANI) October 6, 2022
Former Nepali National team captain Sandeep Lamichhane, accused of raping a minor, to return to Kathmandu, Nepal at 10am (local time)
“I will fully cooperate in all stages of investigation and will fight legal battle to prove my innocence,” says his Facebook post. https://t.co/sWTIM5WVNM pic.twitter.com/X1PNPauyqK
— ANI (@ANI) October 6, 2022
ఇది కూడా చదవండి: టీ20 రికార్డులన్నీ బద్దలు! 77 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ‘హల్క్’