ఒక్క ఇన్నింగ్స్‌లో 22 సిక్సులు కొట్టినట్లు కలలో కూడా ఊహించలేం. అసలు టీ20 క్రికెట్‌లో కనీవిని ఎరుగని రికార్డు.. సెంచరీ కొడితేనే ఆహా ఓహో అంటున్న టైమ్‌లో.. వెస్టిండీస్ హల్క్ ఏకంగా డబుల్ సెంచరీ బాదేసి.. ప్రపంచ క్రికెట్‌ను ఉలిక్కిపడేలా చేశాడు. మంచి నీళ్లు తాగినంత సులువుగా.. ఫోర్లు, సిక్సులు కొడుతూ.. కేవలం 77 బంతుల్లోనే 17 ఫోర్లు, 22 సిక్సులతో 205 పరుగుల చేశాడు భారీకాయుడు రహ్‌కీమ్ కార్న్‌వాల్. టీ20 క్రికెట్‌లో ఇదే మొట్టమొదటి డబుల్ సెంచరీ కావడం విశేషం. పైగా ఈ మ్యాచ్‌లో రహ్‌కీమ్ జట్టు స్కోర్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయిన అట్లాంటా ఫైర్ ఏకంగా 326 పరుగులు భారీ స్కోర్ చేసింది. టీ20 క్రికెట్‌లో ఇంత భారీ నమోదైనట్లు ఎక్కడా దాఖలాలు కూడా లేవు.
అట్లాంటా టీ20 ఓపెన్‌లో బుధవారం అట్లాంటా ఫైర్-స్క్వైర్ డ్రైవ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఇటివల వెస్టిండీస్‌లో జరిగిన కరేబియన్ లీగ్‌లో దుమ్మురేపిన కార్న్‌వాల్.. అటునుంచి అటే.. అట్లాంటా టీ20 ఓపెన్ ఆడేందుకు వెళ్లాడు. స్క్వైర్ డ్రైవ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన హల్క్ ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుపడ్డాడు. బంతికి బ్యాట్‌కు తగిలితే చాలు.. బౌండరీ లైన్ బయటే అన్నట్లు సాగింది అతని ఇన్నింగ్స్. బౌండరీ లైన్ దాటి వెళ్లిన బంతిని తీసుకురావడానకే అన్నట్లు ఫీల్డర్లు పరిస్థితి తయారైంది. ఏ బౌలర్ వచ్చినా ఒకటే ట్రీట్‌మెంట్ చేశాడు హల్క్. తన భారీ కాయానికి తగ్గట్లే.. భారీ షాట్లతో దుమ్మురేపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అట్లాంటా ఫైర్ నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 326 పరుగలు భారీ చేసింది. రహ్‌కీమ్ కార్న్‌వాల్ 77 బంతుల్లో 17 ఫోర్లు, 22 సిక్సులతో 205 పరుగులు చేశాడు. రహ్‌కీమ్‌తో పాటు స్టీవెన్ టేలర్(53) సమీ అస్లామ్(53 నాటౌట్) రాణించడంతో స్క్వైర్ డ్రైవ్ టీమ్ ముందు అట్లాంటా భారీ స్కోర్ నిలబెట్టింది. ఈ స్కోర్ చూసే సగం చచ్చిన స్క్వైర్ డ్రైవ్ టీమ్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగుల చేసింది. దీంతో 172 పరుగుల భారీ తేడాతో అట్లాంటా ఫైర్ విజయం సాధించింది.
West Indian Rahkeem Cornwall, blasted an unbeaten 205 in just 77 balls (SR 266.23) that included 22 sixes and 17 fours in an American T20 competition known as the Atlanta Open. A prize money of $75,000 is available to the winning team.#CricketTwitter
pic.twitter.com/nOoEqqcujB— Cricstagram (@Cricstagram) October 6, 2022
ఇది కూడా చదవండి: లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌గా.. గంభీర్ సేన! ఫైనల్లో పఠాన్ టీమ్ చిత్తు