కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారాస భారీ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ లతో పాటుగా కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో క్రేంద్ర ప్రభుత్వంపై అలాగే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీ వల్ల దేశంలో బాగుపడిన ఒకే ఒక్క వ్యక్తి అదానీ అని ఈ సందర్భంగా అన్నారు. బండి సంజయ్ ప్రధాని మోదీ దేవుడు అని చెబుతున్నాడు.. మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన ఈటెల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేటీఆర్. తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దే నాయకుడు ఈటెల అని మండిపడ్డాడు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం నిర్వహించిన భారాస బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మోదీపైన ఈటెల రాజెందర్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ సభకు కేటీఆర్ తో పాటుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ లతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. “14 నెలల కిందట జరిగిన ఉప ఎన్నికల్లో మీరు ఈటెల రాజేందర్ గెలిపించారు. మీకు రూ. 3వేల పింఛను ఇస్తామన్నారు, కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షాను రప్పించి నిధుల వరద పారిస్తానన్నాడు. రాజేందర్ చెప్పిన మాటలు ఏమయ్యాయి? అభివృద్ధి ఎక్కడ జరిగింది. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అన్న రాజేందర్ ను.. మీకు పరిచయం చేసింది కేసీఆర్ కాదా?” అని ప్రశ్నించారు కేటీఆర్.
ఇక ఈ దేశంలో ప్రధాని మోదీ వల్ల బాగుపడిన ఒకే ఒక్క వ్యక్తి అదానీ అని ఎద్దేవ చేశాడు. ప్రధాని ఇచ్చిన మాటలు అన్ని నీటి మీద రాతలే అని మండిపడ్డాడు. జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు ఏమయ్యాయి అని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని ఎక్కడున్నాడని కేటీఆర్ ఈ సందర్బంగా ప్రశ్నించాడు. ఇక కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ దేవుడు అంటున్నాడు బండి సంజయ్.. మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వనందుకా? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన నిరసనల్లో 700 మంది రైతులు చనిపోయినందుకా? ఇక 14 మంది ప్రధానులు చేసిన అప్పులను ఒక్క మోదీనే చేసినందుకా ? దేవుడు అనేది అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మరి ప్రధాని మోదీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.