విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ.. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు, ఎన్టీఆర్ వారసలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ వైద్య రంగానికి చేసిన విశేష సేవలు దృష్టిలో పెట్టుకుని.. యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామని జగన్ చెబుతున్నారు. అంతేకాక ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో గౌరవం అని.. అందుకే ఎవరు అడగకపోయినా సరే కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఆయన పేరు పెట్టామని జగన్ వెల్లడించారు. ఇప్పుడు ఎన్టీఆర్ మావాడంటూ ప్రచారం చేసుకుంటున్న టీడీపీ నేతలు, ఆయన వారసులు.. నాడు చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన రోజు ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల క్రితం ‘డెక్కన్ క్రానికల్’ న్యూస్ పేపర్‌లో ప్రచురితమైన చంద్రబాబు ఇంటర్వ్యూ ఒకటి తాజాగా వైరలవుతోంది. దీనిలో చంద్రబాబు స్వయంగా మాకు ఎన్టీఆర్ అవసరం లేదని ప్రకటించాడు.
వైస్రాయ్ హోటల్ ఘటన తర్వాత.. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 27 ఏళ్ల క్రితం డెక్కన్ క్రానికల్‌కు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాత ఇంటర్వ్యూని ఒకదాన్ని వెలుగులోకి తెచ్చారు వైసీపీ నాయకులు. దీనిలో చంద్రబాబు.. తమకు ఎన్టీఆర్ అవసరమే లేదని స్పష్టంగా చెప్పాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కాపీ పోస్టర్లు విజయవాడ గోడల మీద ప్రత్యక్షం అయ్యాయి. ఇక నెటిజనులు వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మరి ఇప్పుడు ఈ కపట నాటకాలేందుకు బాబు అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌పై నిజంగా అంత గౌరవాభిమానాలు ఉంటే ఆనాడు ఎందుకు పదవీ నుంచి దించేశారని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
ఈరోజు విజయవాడలోనే గోడకెక్కిన ఈ ఆర్టికల్.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రత్యక్షం అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ పోస్టర్ మాత్రం తెగ వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The power of print … 27 years and the story lives on https://t.co/sDyIjlVtH0
— Saye Sekhar Angara (@sayesekhar) September 25, 2022
@sayesekhar your story on DC going viral in Vijayawada. Babu : We don’t need NTR pic.twitter.com/OPfNLpiEZR
— Naveen Kumar V (@NaveenJournali1) September 25, 2022
27 సంవత్సరాల తర్వాత కుడా విజయవాడ గోడలు ఎక్కిన ప్రింట్ మీడియా . ఆర్టికల్ రాసింది @sayesekhar
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా గొడెలేక్కేస్తుంది త్వరలో .
Babu :- we don’t need NTR pic.twitter.com/vru6Yc9fsc— Eclector (@eclector1419856) September 25, 2022