ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే.. చెంప ఛెళ్లుమనిపిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఎవరి ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి ఎన్ని వైద్య కళాశాలలు వచ్చాయనే అంశంపై దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్‌కు సవాల్ విసిరారు జోగి రమేష్. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఎన్టీఆర్ ఎందుకు గుర్తు రాలేదు. లోకేశ్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా ఏం చేయలేడు. టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి కుప్పం సంఘటనలే నిదర్శనం. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది. టీడీపీ జెండాను, పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారు’’ అని చెప్పుకొచ్చారు.
అంతేకాక తమ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే.. మర్యాదగా ఉండదని హెచ్చరించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్.. తమ ముఖ్యమంత్రిని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. జగన్‌పై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే.. లోకేష్ చెంప ఛెళ్లుమనిపిస్తమని జోగి రమేష్ ఘాటు హెచ్చరికలు జారీ చేశాడు. ఏపీ ప్రజలందరూ సీఎం జగన్‌కు జేజేలు కొడుతున్నారని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కు లేదని.. ఇక రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా కుప్పంతో సహా 175 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక కుప్పం చంద్రబాబు గడ్డ కాదు వైఎస్సార్ అడ్డాగా మారిపోయిందన్నారు. చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. మరి జోగి రమేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.