ఈ మధ్యకాలంలో జనాలను థియేటర్స్ లో భయపెట్టిన సినిమాలు అసలు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా హారర్, థ్రిల్లింగ్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేవి కరువైపోయాయి. అందరూ మాస్ మసాలా, కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ పరుగెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో ప్రేక్షకులను వణికించి, థ్రిల్ కి గురిచేసిన సినిమా ‘మసూద‘. సూపర్ నేచురల్ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ సీరియస్ మోడ్ లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. చూసే ప్రేక్షకుల్లో కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఆసక్తిని క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేసింది.
డెబ్యూ డైరెక్టర్ సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమాని స్వధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. ట్రైలర్ తో కాస్తోకూస్తో ఆసక్తిరేపింది. కానీ.. థియేటర్స్ లో సినిమా చూసిన ఆడియెన్స్ కి మాత్రం రెండున్నర గంటలపాటు అల్లాడించేసిందని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ తో.. చిన్న సినిమాగా విడుదలై.. రెండో రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన మసూద మూవీ.. సుమారు రూ. 4 కోట్లకు పైగా లాభాలను రాబట్టుకుంది. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనిపించుకుంది. అయితే.. సినిమాకి బజ్ లేక, కావాల్సినంత పబ్లిసిటీ చేయకపోవడంతో సినిమా జనాల్లోకి వెళ్ళలేదు.
అదే ప్రమోషన్స్ ఇంకా బాగా చేసి జనాల్లోకి తీసుకెళ్లి ఉంటే.. మసూద విజయం నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. అయితే.. థియేటర్స్ లో సినిమా చూడకపోయినా.. మసూద మూవీని ఓటిటిలో చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఎక్సయిట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. అలాంటి ఆడియెన్స్ కి గుడ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ని ఓటిటిలో చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోండి. మసూద ఓటిటిలోకి వచ్చేస్తోంది.. హారర్ సినిమాలో ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. ముఖ్యంగా స్టోరీ, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ వీక్షకుల మైండ్ బ్లాక్ చేస్తాయి. అదే థ్రిల్ ఇప్పుడు మీరు కూడా అనుభూతి చెందవచ్చు.
బ్లాక్ బస్టర్ మసూద మూవీ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంకా థియేటర్స్ లో నుండి వెళ్ళలేదు. కానీ.. ఈ మధ్య విడుదలైన కొన్ని రోజులకే సినిమాలన్నీ ఓటిటిలోకి వస్తున్నాయి కదా.. అలాగే మసూద కూడా వచ్చేస్తుందని సమాచారం. మరి మసూద మూవీ ఏ ఓటిటిలోకి రాబోతుంది? అనంటే.. తెలుగు ఓటిటి ‘ఆహా‘ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నారట. కాగా.. డిసెంబర్ 16 లేదా 23 నుంచి గానీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో నటి సంగీత, తిరువీర్, బాంధవి శ్రీధర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి థియేటర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మసూద.. ఓటిటి ఆడియెన్స్ ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.