ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడినా, ఆడకపోయినా ప్రేక్షకులు వెయిట్ చేసేది ఓటిటి రిలీజ్ కోసమే. ఎందుకంటే.. లాక్ డౌన్ లో అందరూ ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు. కానీ.. ఒక మంచి సినిమా థియేటర్లలో విడుదలైతే ఫ్యామిలీతో సహా వెళ్లి చూసే ఆడియెన్స్ కూడా ఉన్నారు. అయితే.. హీరోలైనా, మేకర్స్ అయినా చేయాల్సింది ప్రేక్షకులను మెప్పించి, థియేటర్లకు రప్పించే సినిమాలే అనేది అసలు విషయం. స్టార్ హీరోల నుండి యంగ్ స్టర్స్ వరకు ఎవరి సినిమాలైనా ఓటిటికి రావడం ఖాయమే.
ఈ విషయం తెలిసి ఎప్పుడెప్పుడు సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతాయా అని ఎదురుచూసే జనాలు కూడా ఉన్నారు. అయితే.. థియేటర్స్ లో విడుదలైన సినిమా.. కోట్లు కొల్లగొట్టి రికార్డులు తిరగరాసినా.. ఓటిటి రిలీజ్ అనేది ప్రేక్షకులకు ఊరట కలిగించే విషయమే. ఈ క్రమంలో ఇప్పుడు దక్షిణాది విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘కోబ్రా’ చిత్రం త్వరలో ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా.. ఇటీవల బాక్సాఫీస్ వద్ద విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా తెలుగు వెర్షన్ అయితే క్లీన్ హిట్ అయ్యింది. ఈ సినిమాను డిమాంటి కాలనీ, అంజలీ సిబిఐ మూవీస్ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు.
ఈ సినిమాలో విక్రమ్ డ్యూయెల్ రోల్స్ తో పాటు ఏడు డిఫెరెంట్ గెటప్స్ లో యాక్టింగ్ అదరగొట్టాడు. అయితే.. విక్రమ్ క్యారెక్టర్ పరంగా, ఎంచుకున్న కథ పరంగా సినిమా బాగుందని అనిపించినా.. టెక్నికల్ గా అన్ని వర్గాలవారిని ఆకట్టుకోలేకపోయింది కోబ్రా. ఇక మాస్టర్ ఫేమ్ ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ‘సోనీ లివ్’ వారు సొంతం చేసుకున్నారు. ఇక సినిమా వచ్చేసి.. సెప్టెంబర్ 28 నుండి ఓటిటి స్ట్రీమింగ్ కాబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మరోవైపు విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వన్ 1.. సెప్టెంబర్ 30న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. మరి కోబ్రా మూవీ ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Chiyaan Vikram & Srinidhi Shetty நடிப்பில், இசை புயல் AR Rahmanனின் மிரட்டலான இசையில், பணத்திற்காக பல அதிரடியான அவதாரங்கள் எடுத்து கணிதத்தால் அனைவரையும் கலங்கடிக்கும் ஒரு சாமானிய ஆசிரியரின் கதை #Cobra Sept 28 முதல் உங்கள் #Sony LIVல் #CobraOnSonyLIV pic.twitter.com/ydJBWZIQt7
— SonyLIV (@SonyLIV) September 23, 2022