ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు మరణవార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది. దీంతో ఆయన అభిమానులలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. కృష్ణంరాజు మరణవార్త తెలియగానే సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాలలోని సన్నిహిత రాజకీయనేతలు, భారీ సంఖ్యలో అభిమానులు.. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. రెబల్ స్టార్ గా వెలుగొందిన కృష్ణంరాజు ఇకలేరనే వార్తను చిత్రపరిశ్రమ ఇంకా జీర్ణించుకోలేకపోతుంది.
ఈ క్రమంలో కృష్ణంరాజుతో కలిసి పనిచేసిన సహనటులు, టెక్నీషియన్స్, దర్శకనిర్మాతలు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా కృష్ణంరాజు మృతిపట్ల ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. లారెన్స్, ప్రభాస్ కాంబినేషన్ లో ఎన్నో సాంగ్స్ తెరమీదకు వచ్చాయి. అలాగే ప్రభాస్, కృష్ణంరాజులతో లారెన్స్ ‘రెబల్’ మూవీ తెరకెక్కించాడు. ఆ విధంగా కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని.. కృష్ణంరాజు, ప్రభాస్ లతో కలిసి ఉన్న ఫోటోని లారెన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇక ట్విట్టర్ లో పోస్ట్ లో “రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని చాలా మిస్ అవుతున్నాను. ఆయన ప్రతి ఒక్కరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు.. అందరికీ ఓ అమ్మలా భోజనం పెట్టేవారు. ఇప్పుడు నేను కృష్ణంరాజు గారి ప్రేమ, కేరింగ్ ని బాగా మిస్ అవుతున్నాను. నేను టౌన్ లో లేని కారణంగా ఆయన చివరిచూపుకు నోచుకోలేకపోవడం నా దురదృష్టం. ఆయన వారసత్వం ప్రభాస్ ద్వారా ఎల్లప్పుడూ కంటిన్యూ అవుతుంది’ అని తన ఆవేదనకు బయటపెట్టాడు లారెన్స్. ఇదిలా ఉండగా.. ప్రభాస్, కృష్ణంరాజులతో లారెన్స్ రూపొందించిన రెబల్ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇప్పుడు లారెన్స్ నటుడిగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. మరి కృష్ణంరాజు మృతిపట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
I miss my Rebel star Krishnam Raju Garu. He takes care of everyone like his own child and serves them food like a mother. I miss that love and care. My bad luck, I wouldn’t pay my last respect for him as I’m not in town. His legacy will always live through prabhas. 🙏🏼🙏🏼 pic.twitter.com/Sg16fqIvNI
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2022