భారతీయుల మేధాశక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్వకాలం నుంచి నేటికాలం వరకు ఎందరో భారతీయుల తమ మేధాశక్తితో ప్రపంచం ముందు భారతదేశానికి గుర్తింపు తెస్తున్నారు. టెక్ నైపుణ్య విషయంలో భారతీయుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచస్థాయి ఐటీ సంస్థల్లో మనవాళ్లదే హవా. సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వంటివారు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర కు చెందిన వేదాంత్ కాటే అనే కుర్రాడు అమెరికా చెందిన ఓ సంస్థ నిర్వహించిన కోడింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. అయితే వయస్సు తక్కువగా ఉందనే కారణంతో జాబ్ విషయంలో వెనక్కి తగ్గింది సదరు అమెరికా కంపెనీ.
మహారాష్ట్రకు చెందిన వేదాంత్.. టెక్ కి సంబంధించిన విషయాలంటే చాలా ఆసక్తి. వతోడా ప్రాంతంలో నారాయణ ఇ-టెక్నో స్కూల్లో చదువుతున్న వేదాంత్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో సొంతంగా రాడార్ ను తయారుచేసి బంగారుపతకం సాధించాడు. అతడి తల్లిదండ్రులు రాజేశ్, అశ్విని నాగపూర్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్లు. దీంతో తన తల్లికి చెందిన పాత ల్యాప్ టాప్ పై కోడింగ్ తో కుస్తీలు పట్టే వాడు. ఈ క్రమంలోనే అమెరికాలోని ది న్యూజెర్సి అడ్వర్టయిజింగ్ కంపెనీ నిర్వహించిన పోటీలో వేదాంత్ నెంబర్ వన్ గా నిలిచాడు. కేవలం రెండ్రోజుల్లో 2,066 లైన్ల కోడ్ ను రాశాడు. ఈ పోటీలో 1000 మంది పాల్గొన్నారు. వేదాంత్ నే విజేతగా నిలిచాడు. దీంతో, ఆ అమెరికా కంపెనీ ఏడాదికి రూ.33 లక్షల వేతనంతో వేదాంత్ కి ఉద్యోగం ఆఫర్ చేసింది.
తమ కంపెనీలో చేరి ఇతర కోడింగ్ నిపుణులపై మేనేజర్ గా వ్యవహరించాలని కోరింది. ఈ క్రమంలో అతని డాక్యుమెంట్లు పరిశీలించారు సదరు కంపెనీ అధికారులు. వేదాంత్ దేవ్ కాటే వయసెంతో తెలసుకున్న ఆ కంపెనీ తన ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. హేమాహేమీ టెక్ నిపుణలను వెనక్కినెట్టిన వేదాంత్ వయస్సు కేవలం 15 ఏళ్లే. దాంతో, అంత చిన్నపిల్లవాడ్ని ఉద్యోగంలోకి తీసుకోలేమని ది న్యూజెర్సీ అడ్వర్టయిజింగ్ కంపెనీ విచారం వ్యక్తం చేసింది. అయితే వేదాంత్ నిరాశ చెందనక్కర్లేదని, చదువు పూర్తయిన తర్వాత తమను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు వేదాంత్ కు లేఖ రాసింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Justice NV Ramana: సోషల్ మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ సీరియస్ కామెంట్స్!
ఇదీ చదవండి: మీసం లేకపోతే బతకలేనంటున్న మహిళ! ఎవరు ఈమె?
ఇదీ చదవండి: MBA chai wala: చాయ్ వాలా సంపాదన అక్షరాల రూ.4 కోట్లు!