'బాగా సంపాదించాలి.. గొప్ప పేరు తెచ్చుకొవాలి''.. నేటి సమాజంలో ప్రతీ ఒక్క యువతకు ఉండే ఆలోచన. అలాగే అందరు అడుగులు ముందుకేస్తారు. కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. మరి కొందరు తమకు ఉన్న కష్టాలను సాకుగా చూపి ఏదోఒక జాబ్ లో చేరి కాలం వెళ్లదీస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే కుర్రాడు మాత్రం ఇలా కాదు. అతడు పెట్టింది టీ కొట్టే.. అలా అని అతన్ని తక్కువగా అంచనా వేస్తే తప్పే! ఎందుకంటే అతనికి వచ్చే ఆదాయం రూ.వందల్లో.. వేలల్లో.. లక్షల్లో కాదు ఏకంగా కోట్లల్లో.. అవును మీరు విన్నది నిజమే. మరి అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. ప్రపుల్ బిల్లోర్.. అందరి తల్లిదండ్రులు చెప్పినట్లే ప్రపుల్ కు కూడా వారి తల్లిదండ్రులు బాగా చదువుకుంటే మంచి జీతం వచ్చే ఉద్యోగం వస్తుందని చెప్పారు. దాంతో వారి కోరిక మేరకు అహ్మదాబాద్ లో ఎంబీయే లో చేరాడు. నాలుగు సార్లు రాసినా 'క్యాట్' దాటలేదు. కష్టం అనుకున్నాడు. అయినా అతనిలో డబ్బు సంపాదించాలనే ఆశ చావలేదు. వ్యాపార వేత్తల పుస్తకాలు బాగా చదివేవాడు. 2016లో తన దగ్గర ఉన్న కొద్ది పాటి డబ్బుతో తన ఊరు ధర్ దాటాడు. మరోవైపు మెక్ డొనాల్డ్స్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూనే వ్యాపార ప్రయత్నాలు మెుదలు పెట్టాడు. చాలా మంది కొత్త వ్యక్తులను కలిసి వారి ఆలోచనల గురించి తెలుసుకునే వాడు. కొన్నాళ్లకు ప్రపుల్ కు అర్ధం అయ్యింది ఏంటంటే ఏ ఉద్యోగం చేసినా లక్షలకొద్దీ సంపాదించలేను అని. దాంతో ఉన్న పలంగా చదువు ఆపేసి రహదారి పక్కన ఓ టీ కొట్టు తెరిచాడు. దాని పేరే ''మిస్టర్ బిలియనీర్ అహ్మదాబాద్ (ఎంబీఏ)''.ప్రస్తుతం ఈ టీ కొట్టు తెలియని వారు లేరు అక్కడ. అయితే ఈ నిర్ణయంతో తల్లిదండ్రులు, బంధువులు అతన్ని తిట్టారు. అవన్ని అతడు పట్టించుకోలేదు. మెుదట్లో అతని చేసిన టీ ఏమంత రుచిగా ఉండేది కాదు. చిన్నగా టీ పై పట్టు సాధించాడు. కొత్త కొత్త ఐడియాలతో ఆకట్టుకోసాగాడు. కేఫ్ లో క్రికెట్ మ్యాచ్ లు ఏర్పాటు చేయడం, లూడో గేమ్స్ ఆడించడం.. తమకి ఇష్టమైన వారికి సందేశాలు రాసుకునేలా బోర్డులు ఏర్పాటు చేయడం లాంటి ఉపాయాలు బాగా పని చేశాయి. దీంతో బాగా పేరు రావడంతో రెండో కేఫ్ ని తన సొంత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్ లో ఓపెన్ చేశాడు. ఇలా నాలుగు సంవత్సరాల్లో 50కి పైగా ఫ్రాంఛైజీలను ప్రారంభించాడు. ప్రస్తుతం అతని టర్నోవరు సంవత్సరానికి సుమారు రూ. 4 కోట్ల రూపాయలు దాటింది. అందరిలా మూస పద్దతిలో కాకుండా లైఫ్ లో దూసుకుపోతున్న ప్రపుల్ బిల్లోర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. We are much elated to announce that MBA CHAI WALA is all set to arrive in the "Steel City of India", Jamshedpur. Come and join us for the grand opening with Mr. Prafull Billore on 25th July, 5 P.M We have our special chai ready for you. See you on Monday! pic.twitter.com/OSbLyPFLz1 — Prafull MBA CHAI WALA (@Prafull_mbachai) July 23, 2022 ఇదీ చదవండి: వీడియో: ఐదో అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి! క్యాచ్ పట్టి కాపాడాడు! ఇదీ చదవండి: భార్య బ్యాంక్ మేనేజర్, భర్త డబ్బుపై ఆశపడ్డాడు.. చివరికి 20 కత్తిపోట్లతో!