ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన వస్త్రధారణ మీద విపరీతమైన చర్చ నడుస్తుంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ ఉత్తరాఖండ్ ప్రత్యేక టోపీ, మెడలో మణిపూర్ కండువాతో దర్శనమిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే మోదీ వారిని ఆకట్టుకునేందుకు వీటిని ధరించాడని విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరిస్తే ఏం కాదు కానీ.. కొన్ని ప్రత్యేక వర్గాలకు చెందిన యూనిఫాం ధరించడం నేరం కిందకే వస్తుంది. తాజాగా యూపీ కోర్టు కూడా ఇదే చెప్పింది. ఈ క్రమంలో పీఎంఓ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు..
గతేడాది దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ లో పర్యటించారు. ఆ సయమంలో ఆయన ఆర్మీ యూనిఫాం ధరించారు. ఈ క్రమంలో దీనిపై ప్రయాగ్ రాజ్ కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 140 ప్రకారం సైనికుడు, నావికుడు, వైమానిక దళం ఉపయోగించే దుస్తులు ధరించడం, టోకెన్‌ను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరమని పిటిషన్ లో పేర్కొన్నాడు. వాదనలు విన్న జిల్లా జడ్జి నలిన్ కుమార్ శ్రీవాస్తవ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి : సోషల్ మీడియాలో తగ్గేదేలే.. అంటున్న మోదీ
నవంబర్ 2021లో, జమ్మూ కశ్మీర్‌లోని నౌషేరా జిల్లాలో భారత సాయుధ దళాల సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైనిక యూనిఫాం ధరించారు. మోదీ 2016 నుంచి భారతీయ సైనికులతో దీపావళిని జరుపుకుంటున్నారు. తొలుత ఆయన సాధారణ దుస్తుల్లో కనిపించేవారు. కానీ 2017 నుంచి మోదీ ఎటువంటి చిహ్నాలు లేకుండా ఇండియన్ ఆర్మీ పోరాట యూనిఫాం ధరించడం ప్రారంభించారు.
ఇది కూడా చదవండి : ఆలయ సిబ్బందికి ప్రధాని మోదీ జూట్ పాదరక్షలు కానుక..!
రష్యాకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తన 20 ఏళ్ల పాలనలో, సాయుధ దళాలకు చెందిన దాదాపు అన్ని సైనిక దుస్తులలో కనిపించారు. సైనిక దుస్తులు ధరించిన అధ్యక్షుల జాబితాలో మోదీ కన్నా ముందు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, చైనాలో జి జిన్‌పింగ్ ఉన్నారు.