ఆలయ సిబ్బందికి ప్రధాని మోదీ జూట్ పాదరక్షలు కానుక..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ్ మందిరం ఆలయ సిబ్బందికి ఇచ్చిన కానుక చూసి వారంతా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో పనిచేస్తున్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ జూట్ తో చేసిన పాద రక్షలు సోమవారం పంపించారు. ఆలయ ప్రాంగణంలో లెదర్, రబ్బరు చెప్పులను ధరించడం నిషేధించారు.

image 2 compressed 23కాశీ విశ్వనాథ్ ధామ్‌లో పనిచేసే వారిలో చాలా మంది చెప్పులు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని తెలుసుకున్న ప్రధాని వారి కోసం 100 జతల జ్యూట్ పాదరక్షలను పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చెప్పులు లేకుండా ఉత్త కాళ్లపై నడుస్తూ పనిచేసే వారిలో పూజారులు, సేవ చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు ఉన్నారు. మోదీ వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం తెలిసిందే. కాశీ విశ్వనాథ్ ఆలయం పట్ల మోదీ ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తుంటారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఆ సమయంలో కాళ్లకు రక్షణ లేకుండా పనిచేస్తున్న సిబ్బందిని చూశారు. మరి ఏమనుకున్నారో ఏమో జనపనారతో తయారు చేసిన 100 జతల పాదరక్షలను ఆలయ సిబ్బందికి మోదీ పంపించారు.

ఇది చదవండి : యాదాద్రి ఆలయ పునప్రారంభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ దృష్టి

image 1 compressed 42ఈ మధ్యనే కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణాన్ని భారీగా విస్తరించారు. ఆ సముదాయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ధామ్ మొదటి దశను గత నెలలో ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆగమ సంప్రదాయాల ప్రకారం దేవాలయాల్లో పాదరక్షలకు స్థానం లేదు. అయితే జనపనారతో ఎకో-ఫ్రెండ్లీ వస్తువులతో తయారు చేసినవి కావడం వల్ల ఆలయ ప్రాంగణంలో అర్చుకులు, కార్మికులు, సిబ్బంది.. వాటిని ధరించడానికి వెసలుబాటు కలిగినట్టయింది.