ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజలకు సేవలు చేసేవారు. కానీ ఆ మాటకు అర్ధం మారేలా కొందరు ప్రవర్తిస్తూ.. ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల చేత సేవలు చేయించుకునే వారు అనేలా కొత్త అర్ధం చెప్తుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు కూడా పెత్తనం చెలాయిస్తుంటారు. మరికొందరు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. వారితో గొడవకు దిగితే తామే నష్టపోతామని చాలా మంది సామాన్యులు సర్ధుకుపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి వేధింపులను భరించలేని వారు ఎదురు తిరుగుతారు. కొన్ని సందర్భాలో సదరు నాయకుల, వారి కుటుంబ సభ్యులపై దాడి కూడా చేస్తారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. పారిశుద్ధ్య కార్మికురాలిని దుర్భాషలాడాడని కార్పోరేటర్ భర్తపై తోటి కార్మికులు చితబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో ని ఇండోర్ లో చోటు చేసుకుంది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పట్టణంలోని 13 వార్డు భాజపా కార్పోరేటర్ భర్త సందీప్ చౌహన్ పారిశద్ధ్య కార్మికులిని ఫోన్ లో దుర్భాషలాడాడు. దీంతో సదరు మహిళ బంధువులు, తోటి కార్మికులు కార్పోరేటర్ భర్తపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అతడి పై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అదే సమయంలో పోలీసులు సందీప్ చౌహన్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి.. ఇరువురి మధ్య రాజీ చేయాలనుకున్నారు. పోలీసుల పిలవడంతో చౌహన్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. ఈ క్రమంలో కార్పోరేటర్ భర్తకు వ్యతిరేకంగా కార్మికులు నినాదలు చేశారు. సందీప్ కి పారిశుద్ధ్య కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో చౌహన్ పై దాడి చేసేందుకు కార్మికులు యత్నించారు.
కార్మికుల బృందం కార్పోరేటర్ భర్త సందీప్ చౌహన్ ను పోలీస్ స్టేషన్ ముందే చితబాదేశారు. ఈ క్రమంలో ఆయన అనుచరులకు పారిశుద్ధ్య కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురు ఒకరిపై మరొకరు దాడి చేసుకుని, బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇండోర్ లోని 13వ వార్డు రౌ మున్సిపాలిటీ కార్పోరేటర్ భర్తే సందీప్ చౌహన్. షాడో కార్పోరేటర్ గా సందీప్ వ్యవహరిస్తారని కొందరు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఇండరోని రౌ పోలీస్ స్టేషన్ ఎదుట జరగడం గమనార్హం.