భారత్-పాకిస్థాన్ మధ్య దేశ విభజన సమయం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ కు ఎన్ని సార్లు బుద్ది చెప్పినా గానీ తన తీరు మార్చుకోవడం లేదు. సరిహద్దు వెంబడి ప్రతి రోజు కవ్విస్తూనే ఉంటోంది. రాకెట్ బాంబర్లు వేయడం, ఉగ్రవాదులను పంపడం లాంటి చర్యలు పాక్ కు కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టెర్రరిస్టును భారత సైన్యం అరెస్టు చేసింది. అతడిని విచారించగా సంచలన విషయాలను బయట పెట్టాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారతదేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులను పంపడం పాకిస్థాన్ కు కొత్తేమి కాదు. ఈ క్రమంలోనే కశ్మీర్ లోని నౌషారా సెక్టార్ లో జంగర్ అనే ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నట్లు భారత సైన్యం కంట పడింది. అప్పుడు ఉగ్రవాదులు సరిహద్దు కంచెను కత్తిరిస్తుండగా మన సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో తబ్రక్ హుస్సేన్ అనే టెర్రరిస్టును అదుపులోకి తీసుకుంది. అతడిని విచారించగా పాకిస్థాన్ వక్ర బుద్ది బయట పడింది.
తబ్రక్ హుస్సేన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని కోటిల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా భారత సైన్యం తేల్చింది. అతడిని పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కర్నల్ యూనస్ చౌధ్రీ పంపించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. అదీ కాక తనకు 30 వేల పాక్ కరెన్సీని ఇచ్చి భారత్ లో ఆత్మహుతి దాడి చేసుకోమన్నట్లు తబ్రక్ వెల్లడించాడు. అయితే గత కొన్ని రోజుల ముందు తబ్రక్ ఇండియా సరిహద్దు వెంట రెక్కీ నిర్వహించినట్టు విచారణలో తేలింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గాయ పడ్డ తబ్రక్ కు రక్తదానం చేసి ఐసీయూలో భారత సైన్యం చికిత్స అందిస్తోంది.
ఈ నేపథ్యంలో తబ్రక్ భారత్ లోకి చొరబడటం ఇదే మెుదటి సారి కాదు. 2016లో తన సోదరుడితో కలిసి భారత్ లోకి అక్రమంగా చొరబడ్డారు. అప్పుడు వీరిని భారత సైన్యం అరెస్టు చేసింది. కానీ మానవతా దృక్ఫథంలో విడుదల చేసి పాక్ కు పంపింది. అయినప్పటికీ అతడు తన పద్దతి మార్చుకోకుండా మళ్లీ మన మీద దాడి చేయడానికే వచ్చాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.