ఓ ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపాల్, మేనేజర్ ఇద్దరూ తమ గదులను లాడ్జి రూములుగా మార్చేశారు. ఆ గదుల్లోనే వంట, పెంట చేస్తున్నారు. అధికారులు తనిఖీ చేయగా గదుల్లో మద్యం సీసాలు, నిరోధ్ లు, మహిళల లోదుస్తులు బయటపడ్డాయి. లైబ్రరీకి ఆనుకుని, అమ్మాయిల తరగతి గదుల నుంచి తమ గదుల్లోకి వెళ్లేలా డైరెక్ట్ ఎంట్రీ పెట్టుకున్నారు. అసలేం జరుగుతోందని తనిఖీ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలోని ఓ ప్రముఖ మిషనరీ పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. 3వ నంబర్ జాతీయ రహదారి మీద ఉన్న మిషనరీ స్కూల్లో నిర్వహించిన తనిఖీలో మద్యం సీసాలు, మహిళల లోదుస్తులు, నిరోధ్ లు బయటపడడంతో అధికారులు షాకయ్యారు. ప్రిన్సిపాల్ (ఫాదర్), మేనేజర్ గదుల్లో తనిఖీలు నిర్వహించగా ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. స్టేట్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్సీపీసీఆర్) శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరి గదుల్లో 12 పరుపులు, 16 వివిధ బ్రాండ్లకు సంబంధించిన మద్యం సీసాలు, నిరోధ్ లు, మహిళలు లోదుస్తులు, కోడిగుడ్ల ట్రేలు, గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎస్సీపీసీఆర్ బృందంలో సభ్యురాలు అయినటువంటి నివేదిత శర్మ అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని, విచారణ లోతుగా జరపాలని కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. సాధారణ తనిఖీలో భాగంగా పాఠశాలకు వెళ్లిన తమకు ఆశ్చర్యపోయే దృశ్యాలు కనిపించాయని అన్నారు. పాఠశాలలో కేవలం ప్రిన్సిపాల్, మేనేజర్ మాత్రమే ఉంటారని చెప్పారు. అలాంటప్పుడు పాఠశాలలో గ్రంథాలయం పక్కన 7 గదులు ఎందుకు ఉన్నాయని, ఒక వ్యక్తి ఉండడానికి 7 గదులు ఎందుకని? ప్రశ్నించారు. ఇద్దరే ఉంటున్నప్పుడు 12 పరుపులు ఎందుకు ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. మహిళల లోదుస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని, అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు.
ఆ గదిని ఒక లాడ్జిలా సెటప్ చేసుకున్నారని, ఇది కేవలం ఒక వ్యక్తికి చెందినది కాదని అన్నారు. ఈ గదిని వసతి గృహంగా చాలా మంది ఉపయోగించుకుంటున్నారని, గదిలో 12 పరుపులు ఉన్నాయని కానీ సీసీటీవీ కెమెరాలు లేవని అన్నారు. విద్యార్థినుల తరగతి గదుల్లోకి డైరెక్ట్ గా వెళ్లేలా ఆ గది ఎందుకు ప్రవేశం కలిగి ఉందని ఆమె ప్రశ్నించారు. పైగా ఆ రూమ్ దగ్గర సీసీటీవీ కెమెరాలు అమర్చలేదు. స్కూల్ క్యాంపస్ లో మద్యం అనేది అనుమతి లేదు. అది చట్ట విరుద్ధమని అన్నారు. మత ప్రచారానికి వాడే మెటీరియల్, మద్యం సీసాలు, నిరోధ్ లతో పాటు అభ్యంతరకర పదార్థాలు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. అయితే కలెక్టర్ల ఆదేశాల మేరకు స్కూల్ ని సీజ్ చేశారు. మరి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల ప్రిన్సిపాల్ ఇలా చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
7 रूम, 12 बेड, 16 बोतलें और…आपत्तिजनक सामान, फेमस स्कूल के कमरों का हैरान कर देने वाला नजारा #MadhyaPradesh #ATDigital pic.twitter.com/9ANkxekpLj
— AajTak (@aajtak) March 26, 2023