కేరళ లాటరీ టికెట్‌లు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా వెల్లడించిన కేరళ లాటరీ ఫలితాల్లో ఓ వ్యక్తి 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే..
అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. అదృష్టం కలిసి వస్తే.. కటిక దరిద్రులు కూడా కుబేరులవుతారు. అప్పులపాలై రోడ్డున పడాల్సిన వాళ్లు.. ఐశ్వర్యవంతులవుతారు. అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటే.. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇలా మన దేశంలో సడెన్‌గా ఉన్నట్లుండి కోటీశ్వరులైన వారిని గతంలో కొందరిని చూశాం. అప్పులపాలై, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. అదృష్టం లాటరీ రూపంలో వరించి.. కష్టాల నుంచి బయటపడేసిన ఘటనలు అనేకం చూశాం. అయితే వీరి తలరాత మార్చింది కేరళ లాటరీలు. తాజాగా మరోసారి కేరళ లాటరీ పేరు తెర మీదకు వచ్చింది. వివరాలు తెలియని ఓ అజ్ఞాత వ్యక్తి.. కేరళ లాటరీలో ఏకంగా 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు..
కేరళ లాటరీలు మన దేశంలో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా బుధవారం కేరళలో ఓ లాటరీ ఫలితాలను విడుదల చేశారు. వీటిల్లో ఓ వ్యక్తి.. ఏకంగా 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ విషు బంపర్ లాటరీ 2023 పేరుతో… తిరువనంతపురం జిల్లాలో ఇందుకు సంబంధించిన టికెట్లను అమ్మింది. ఈ లాటరీకి సంబంధించిన డ్రా బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఈ డ్రాలో మలప్పురం జిల్లా తిరువూరులోని ఎం.5087 ఏజెన్సీకి చెందిన ఆదర్శ అనే వ్యక్తి అమ్మిన టికెట్‌కు మొదటి బహుమతి వచ్చింది. దీనిలో భాగంగా ఆ టికెట్ కొన్న వ్యక్తి ఏకంగా 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అంది ఏంటి అంటే..
ఈ లాటరీలో మొదటి ప్రైజ్ గెలిచిన ఆ టికెట్‌ను కొన్న వ్యక్తి ఎవరనేది ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ టికెట్ నెంబర్ వీఈ 475588. ఈ టికెట్ మీద మొత్తం 12 కోట్లు గెలవగా.. ఈ గెలిచిన మొత్తంలో 10శాతం ఏజెన్సీకి కమిషన్.. 3శాతం ఇతర పన్నులు కట్ అవుతాయి. వీటన్నింటినీ మినహాయించుకుని మిగిలిన మొత్తం రూ.7.20కోట్లు మొదటి బహుమతి విజేతకు అందజేస్తారు ఇదే డ్రాలో రెండో బహుమతిగా.. ఒక్కొక్కరికి కోటి చొప్పున ఆరుగురికి.. సెకండ్ ప్రైజ్ వచ్చింది.
విషు బంపర్ 2023 ఫలితాలను డ్రా ద్వారా ప్రకటించిన వెంటనే కేరళ లాటరీ విభాగం అధికారికవెబ్‌సైట్ www.keralalotteries.comలో విజేతల వివరాలను పొందు పరిచింది. ఎవరైనా సరే ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చు. 30 రోజుల్లోగా విజేతలు టిక్కెట్‌ను లాటరీ విభాగానికి సమర్పించాలి. అంతకు ముందు కేరళ ప్రభుత్వ గెజిట్‌లో ఫలితాన్ని ధృవీకరించాలని టిక్కెట్ హోల్డర్‌లకు తెలియజేయబడింది. ఈ లాటరీ నిర్వహణ అంటే టికెట్ అమ్మకాలు, ప్రైజ్ మనీ కలెక్ట్ చేసుకునే అంశాలకు సంబంధించి పలు నియమాలు అమల్లో ఉన్నాయి.
దీనిలో భాగంగా లాటరీ బహుమతి రూ. 5000 కంటే తక్కువగా ఉంటే, రాష్ట్రంలోని ఏ లాటరీ దుకాణం నుంచి అయినా ఈ మొత్తాన్ని తీసుకోవచ్చు. 5000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే, టిక్కెట్, ఐడీ రుజువును ప్రభుత్వ లాటరీ కార్యాలయం లేదా బ్యాంకుకు సమర్పించాలి. విషు బంపర్ 2023 తర్వాత, తరువాతి కేరళ బంపర్ లాటరీ మాన్‌సూన్ బంపర్ 2023 గా ఉండబోతోంది. సాధారణంగా, కేరళలో ఓనం, విషు, క్రిస్మస్, పూజ సమయాల్లో బంపర్ లాటరీ టిక్కెట్‌లు జారీ చేస్తారు.