సాధారణంగా ఆలయాల వైపు తెలివైన మేకలు రావు. వాటిని తల్లికి బలిస్తారు కాబట్టి.. ‘రాను రాను వీలు కాదు ఒగ్గేవయ్యో’ అని మొత్తుకుంటాయి. కానీ మన సొసైటీ ఆఫ్ మనుషులు మేక మొర ఆలకించక బలిస్తారు. ఈ విషయం తెలిసే మేకలు భయంతో వణుకుతుంటాయి. కానీ ఒక మేక మాత్రం ధైర్యంగా ఆలయంలోకి ప్రవేశించింది. ఎన్ని లివర్లు ఉంటే అంత ధైర్యంగా ఆలయంలోకి ప్రవేశిస్తుంది? అసలు ఆలయం చుట్టుపక్కలకు రావడానికే భయపడే మేకలున్న ఈ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఒక మేక ధైర్యంగా.. చుట్టూ మనుషుల మధ్య చేరి మనుషులు చేసే పనులు చేస్తుంది. గుడిలో దైవాన్ని చూసి మనుషులు ఏం చేస్తారో.. సరిగ్గా అలానే ఈ మేక కూడా చేస్తుంది. మనుషుల్ని అనుకరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లోని పరమత్ ఆలయంలోని శివలింగం ముందు మోకాళ్లు వేసి మరీ ఒక మేక తన భక్తిని చాటుకుంది. అది చూసిన భక్తులు దైవం పట్ల మేక ఎంత విశ్వాసం చూపిస్తుందో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం మేక భక్తికి ఆశ్చర్యపోతున్నారు. పురాణాలు, కథల్లో జంతువులు దైవ దర్శనం చేసుకోవడం వంటి సంఘటనల గురించి వింటాము. కానీ నిజ జీవితంలో మాత్రం చాలా అరుదు ఇలాంటివి జరగడం. అసలే దైవం మీద భక్తి సన్నగిల్లుతున్న తరుణంలో మూగ జీవి ఇలా దైవభక్తిని ప్రదర్శించడం అంటే గొప్ప విషయమే.
कानपुर : परमट मंदिर की घटना, बाबा आनंदेश्वर की आरती में बकरा घुटनों के बल बैठ गया, भक्तों के साथ शिवलिंग के सामने नतमस्तक…!
हर हर महादेव🙏🏻🚩https://t.co/kTnNQhsubN pic.twitter.com/ZTHFHXaJmh
— वैशाली दुबे (सन्यासिन) (@Sanyasin_1) October 9, 2022