సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థుల హాల్ టికెట్స్ పై పేరు లేదా వివరాలు తప్పుగా ప్రింట్ అయ్యాయని అప్పుడప్పుడు వింటుంటాం. ఇటీవల ఓ విద్యార్థిని విషయంలో జరిగిన తప్పిదం దేశవ్యాప్తంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. పరీక్ష రాసేముందు అడ్మిట్ కార్డు ప్రింటౌట్ కోసం యూనివర్సిటీకి వెళ్లిన విద్యార్థిని.. తన అడ్మిట్ కార్డు చూసి షాక్ అయ్యింది. మరి ఆ విద్యార్థిని ఎవరు? అసలేం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ కి చెందిన ‘బినోద్ బిహారీ మహ్తో కోయలాంచల్ యూనివర్సిటీ’లో.. అదే ప్రాంతానికి చెందిన కాజల్ కుమారి అనే విద్యార్థిని పీజీ 2వ సెమిస్టర్ చదువుతోంది.
ఇక పరీక్షలు దగ్గరపడటంతో అడ్మిట్ కార్డు కోసం యూనివర్సిటీకి వెళ్ళింది. తీరా తన హాల్ టికెట్ ప్రింటౌట్ పై ఉన్న డీటెయిల్స్ చూసి ఓకే అనుకున్న కాజల్.. దానిపై ఉన్న ఫోటో చూసి అవాక్కయింది. తన పేరు, ఊరు వివరాలన్నీ సరిగ్గానే ఉన్నప్పటికీ, తన ఫోటో ప్లేస్ లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఫోటో ఉండటం చూసి ఆందోళనకు గురైంది. దీంతో ఆ హాల్ టికెట్ పై తన ఫోటో లేకపోతే పరీక్షలు రాయనివ్వరు అనే భయంతో వెంటనే యూనివర్సిటీ సిబ్బందికి విషయాన్నీ చేరవేసింది. అయితే.. ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ సిబ్బంది.. కాజల్ ఫోటో స్థానంలో ఐశ్వర్యరాయ్ పిక్ రావడం సాంకేతికంగా జరిగిన తప్పిదమని క్లారిటీ ఇచ్చారు.
అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శుక్ దేవ్ భోయ్ స్పందిస్తూ.. సాంకేతిక లోపం కారణంగానే హాల్ టికెట్ లో ఫోటో మారిపోయి ఉంటుంది. ఈ విషయంపై విచారణ చేస్తాము. అలాగే విద్యార్థిని కాజల్ కుమారి పరీక్షలు రాసేందుకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో యూనివర్సిటీ తప్పిదమా లేక యూనివర్సిటీ వెబ్ సైట్ ని ఎవరైనా హ్యాక్ చేశారా అనే దిశగా కూడా విచారణ జరపనున్నట్లు సిబ్బంది తెలియజేశారు. అయితే.. విద్యార్థిని ఫోటో ప్లేస్ లో ఐశ్వర్యరాయ్ పిక్ రావడమేంటని విషయం తెలిసిన జనాలు, నెటిజన్స్ ఆశ్చర్యంతో నోరెళ్ళబెడుతున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని హాల్ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Photo of Bollywood actress #AishwaryaRaiBachhan in place of an examinee on the admit card has created a flutter in the #BBMKU, #Dhanbad.#Jharkhand pic.twitter.com/mzU8wTJwsl
— Himanshu dixit 💙 (@HimanshuDixitt) October 11, 2022