మనం తరచుగా కుటుంబం లేదా స్నేహితులతో కలిసి హోటల్స్, రెస్టారెంట్ లకు వెళ్తుంటాము. అక్కడ మనకు నచ్చిన ఆహారం ఆర్డర్ చేస్తాము. దీంతో అక్కడ ఉండే వెయిటర్ లు త్వరగా ఆర్డర్ తీసుకువస్తుంటారు. ఎంతో పద్ధతిగా మనకు ఫుట్ ని సర్వర్ చేస్తారు. మనం ఆహారాని ఫుల్ గా లాగిం చేస్తుంటాము. చివరగా బిల్ కట్టేటప్పుడు వెయిటర్ కి ఎంతో కొంత టిప్ ఇస్తుంము. ఎవరికి తొచినంత వారు టిప్ గా ఇస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం టిప్ గా రూ.2 లక్షలు ఇచ్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మరి.. ఎందుకు అంత పెద్ద మొత్తంలో టిప్ప్ ఇచ్చాడు? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాలోని పెన్సిల్వేనియాలోని ఒక రెస్టారెంట్ లో ఈ ఆశ్చర్యపోయే ఘటన చోటుచేసుకుంది. పెన్సిల్వేనియాలోని ఆల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో మరియానా లాంబార్ట్ అనే యువతి వెయిటర్ గా పనిచేస్తుంది.ఈ క్రమంలో ఈ కేఫ్ కి ఒకరోజు ఎరిక్ స్మిత్ అనే కస్టమర్ వచ్చాడు. అతడు అడిగిన ఆర్డర్లు అన్ని ఎంతో ఒపికగా ఆ వేయిటర్ సర్వ్ చేసింది. దీంత అతడి బిల్లు 13.25 డాలర్లు అయింది. వాటి తోపాటు ఆమెకు టిప్ గా 3000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.2.4లక్షలు ఇచ్చాడు. మొదట ఆ కేప్ వాళ్ల నమ్మలేదు. అయితే ఆ టిప్ కి సంబంధించిన డబ్బు సదరు వెయిటర్ కి క్రెడిట్ కావడంతో ఆశ్చర్యపోయారు. తను చేసిన పనికి వేల డాలర్లు ఇచ్చారని మరియానా లాంబెర్ట్ ఎంతో పొంగిపోయింది.
ఇది నిజమేనా? అని ప్రశ్నిస్తే.. “టిప్స్ ఫర్ జీసస్” అనే ప్రచారం చూసి తను స్ఫూర్తిపొందానని, అందుకే ఇలా టిప్స్ ఇస్తున్నానని చెప్పాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఈ టిప్ డబ్బులపై తన క్రెడిట్ కంపెనీకి రిపోర్టు చేశాడు ఎరిక్ స్మిత్. దీంతో సదరు కంపెనీకి స్మిత్‌కు మధ్య కోర్టు వివాదం జరుగుతోంది. ఈ విషయాన్ని తెలిసిన రెస్టారెంట్ యజమాని.. ఫేస్బుక్ ద్వారా స్మిత్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు.దీంతో ఆల్‌ఫ్రెడ్స్ పిజ్జా కేఫ్ మేనేజర్ జాచరీ జాకబ్సన్.. తను కూడా కోర్టుకెళ్లాడు. ఇంత గొడవ చేయాలని అనుకుంటే అసలు టిప్ ఇవ్వడం ఎందుకని ఆయన అడిగారు. ఈ డబ్బు తిరిగి చెల్లించాలని అడక్కపోతే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:మందు తాగటంలో వరల్డ్ రికార్డ్.. ఏకంగా 30 లీటర్లు తాగాడు
ఇదీ చదవండి: వీడియో: అర్ధరాత్రి సూపర్ మార్కెట్లో ఎలుగుబంటి! అక్కడ ఏం చేసిందంటే..