Social Media: కొంతమంది మనసు బాగోలేకపోతే తాగుతారు.. మరికొంత మంది అలవాటు కొద్దీ తాగుతారు. ఇంకా కొంతమంది దీనికి భిన్నంగా ఉంటారు. వాళ్లు రికార్డులు సృష్టించటానికి తాగుతుంటారు. ఇలా రికార్డుల కోసం తాగే వారు అత్యంత అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే బ్రిటన్‌కు చెందిన 22 ఏళ్ల నాథాన్ క్రింప్. ఇతగాడు 17 గంటల్లో 30 లీటర్ల మద్యం తాగాడు. అంతా ఒకే చోట కాదు.. 67 వేరు వేరు పబ్బులలో మద్యం తాగాడు. గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పాడు. ఇంతకీ సంగతేంటంటే.. బ్రిటన్‌లోని బ్రింగ్‌టన్‌కు చెందిన నాథాన్ క్రింప్‌కు గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాలన్న కోరిక పుట్టింది.
గ్యారెథ్ మిర్ఫీని టార్గెట్ చేశాడు. గ్యారెథ్‌పై ఓ గిన్నిస్ రికార్డు ఉంది. అతడు 17 గంటల్లో 56 బార్లలో మందు తాగాడు. క్రింప్ ఈ రికార్డును దాటాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. తన మిత్రులను రంగంలోకి దింపాడు. 17 గంటల్లో 67 పబ్బులలో మందు తాగాడు. గ్యారెథ్ రికార్డును చెరిపేశాడు. గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. దీనిపై నాథాన్ క్రింప్ మాట్లాడుతూ.. ‘‘ అంత తక్కువ టైంలో నేను 20-30 లీట్ల దాకా మందు తాగాను.
దాని వల్ల తరచుగా మూత్రానికి వెళ్లవలసిన పరిస్థితి. దానికే ఎక్కువ టైం వేస్ట్ అయింది. ప్రతీ పబ్‌లో ఏదో ఒక బివరేజ్ తాగాలి. అంతేకాదు. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించాలి. పబ్ రిసిప్ట్, ప్రత్యక్ష సాక్షుల సంతకం కూడా ఉండాలి’’ అని పేర్కొన్నాడు. మరి, 17 గంటల్లో 67 పబ్‌లలో 30 లీటర్ల మద్యం తాగి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన క్రింప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.