కొన్ని కొన్ని వీడియోలు చూడటానికి కామెడీ గా అనిపించినా.. అందులో చాలా అర్ధం దాగి ఉంటుంది. సరిగ్గా చూసి ఆలోచిస్తే… ఆ ఘటనకు గల కారణాలను తెలుసుకోగలం. ఓ సూపర్ మార్కెట్ లోకి ఎలుగు బంటి ఒకటి దూరింది. అక్కడ కొన్ని తినుబండారలను తీసుకుని తిని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవుల్లో ఆహారం దొరకకపోవడంతో వల్లనే వన్యప్రాణులు మనుషుల ఉండే ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. మానవుడు తన స్వార్ధం కోసం అడవులను నరికివేయడం వలనే పాపం.. ఆ ఎలుగు బండి జనవాసంలోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒలంపిక్ వ్యాలీలో ఈఘటన జరిగింది. ఆ వ్యాలీలో ఉన్న ఓ సూపర్ మార్కెట్లకో ఆకలితో ఉన్న ఎలుగుబంటి ఒకటి ప్రవేశించింది. ఆ మార్కెట్లో ఉన్న స్నాక్స్ తింటూ రాత్రి అంతా అక్కడే గడిపింది. ఇక అక్కడ క్యాషియర్ గా పనిచేసే వ్యక్తి స్టోర్ రూమ్ తెరచి ఉండటం గమనించాడు. దొంగతనం ఏమైనా జరిగిందేమోనని అతడికి అనుమానం కలిగింది. అసలు ఏం జరిగిందా? అని తెలుసుకునేందుకు లోపలికి వెళ్లాడు. వెంటనే అక్కడ అటు ఇటు తిరుగుతున్న ఎలుబంటి కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయపడి వణికిపోయాడు. అనంతరం కొద్ది సేపటికి ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మార్కెట్ క్యాషియర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ..మొదట ఈ దృశ్యాన్ని తాను నమ్మలేకపోయాననీ.. బాగా పరిశీలించిన తరువాత నమ్మానని తెలిపాడు. గతంలో తాను చూసిన ఎలుగుబంట్ల కంటే ఇది 20 నుంచి 30 శాతం పెద్దగా ఉందని తెలిపాడు. మనల్ని చూస్తే ఎలుగుబంటి రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి భయం వేసిందని తెలిపాడు.
ఎలుగు బంటికి సంబంధించిన దృశ్యాలు సదరు మార్కెట్ లోని సీసీ కెమెరాల్లో రికార్టు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మంది నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేశారు. ఆకలి అనేది జంతువులకైనా మనుషులకైనా కానీ ఒకే విధంగా ఉంటుందని, ఆకలి వేస్తే ఏదో ఒకటి తిన్నాకే మనసు కుదుటపడుతుందని, అందుకే ఆ ఎలుగుబంటి అలా చేసిందని కొందరు నెటిజ్లను కామెంట్స్ చేశారు. మనషులు చేసే పనుల వల్ల అడవుల తరగి పోయి, అక్కడి జంతువులు ఊర్ల మీదకి వస్తున్నాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన ఈ వీడియో ఆకలితో అల్లాడుతున్న అడవి జంతువుల్లోని ఆవేదనను తెలియజేస్తోంది. మరి.. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
‘You’re a thief, man’ — This brown bear helped itself to some late night treats at a 7-Eleven in Olympic Valley, CA 🐻🍫 pic.twitter.com/hcSx1XiKXw
— NowThis (@nowthisnews) September 20, 2022