పోలీసులు నేరస్తుల పాలిట సింహ స్వప్నాలుగా ఉంటారు. ప్రజల ప్రాణ, మానాలు కాపాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షిస్తుంటారు. కర్తవ్య నిర్వహణలో నీతి, నిజాయతీతో పనిచేస్తామని యూనిఫాం వేసుకున్ననాడే ప్రమాణం చేస్తారు. అందుకు తగ్గట్లే పోలీసులు నిజాయితీగా పనిచేస్తుంటారు. కానీ కొందరు మాత్రం లంచం తీసుకోవడమే తమ డ్యూటీ అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. దీని కోసం సామాన్యుల అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ముఖ్యంగా వాహనదారుల నుంచి పీడించి మరి డబ్బులు తీసుకుంటారు. పోలీసులకు ఎదురు తిరిగేందుకు ఎవరు సాహసించరు. కొందరు మాత్రం.. తాము కరెక్టగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి అని పోలీసులకు గట్టిగా సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఓ లారీ డ్రైవర్ ఎంతో ధైర్యంగా పోలీస్ తో ఎదిరించి మాట్లాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఓ రహదారిపై ఓ పోలీస్.. వాహనాలు తనిఖీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ లారీని ఆపి.. వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాలని సదరు వాహన డ్రైవర్ ను అడుగుతాడు. దీంతో లారీకి సంబంధించిన అన్ని పత్రాలను పోలీసు అధికారికి ఇచ్చాడు. అయితే పోలీస్ అతడిని కిందకి దిగాలి అని అంటాడు. ‘ఎందుకు సర్.. నేను అన్ని పత్రాలను చూపించాను.. బండి కాగితాలు అన్నీ అవే’ అని అంటాడు. ‘నువ్వు ముందు బడి దిగు’ అని పోలీసు అంటాడు. మీకు ఏం కావాలి సర్.. చెప్పండి. అన్ని చూపించిన తరువాత కూడా మళ్లీ బండిని ఆపుతున్నారు. ఖాళీగా వెళ్తున్న బండిని ఆపే అధికారం మీకు లేదు? ఇప్పటికే అన్ని కాగితాలు చూపించిన అయినా మళ్లీ బండిని ఆపినారు? ఆంటూ పోలీసులను ప్రశ్నించాడు.
దీంతో నువ్వు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మనిషి మీదకి ఎక్కించే ప్రయత్నం చేశావు అంటూ పోలీసు అంటాడు. స్పీడ్ మీటర్ చెక్ చేయండి అంటు డ్రైవర్ ప్రశ్నిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ఫుల్ వైరల్ అవుతోంది. సదరు పోలీస్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేసున్నారు. “లారీ డ్రైవర్ అంత క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. బండి కాగితాలు పేపర్లు మొత్తం పోలీసు వాళ్ళు తీసుకున్నారు.కానీ బండిని ఎందుకు వదిలి పెట్టడం లేదు. అంటే వారికి ఆమ్యా మ్యా.. కావాలి అన్నమాట అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.