విద్యార్థులంతా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి వారు శ్రమిస్తున్నారు. దానికోసం వారు ఓ ఎడ్యూకేషనల్ సెంటర్ ను ఎంచుకున్నారు. అదే వారు చేసిన పాపం అయ్యింది.. వారి ప్రాణాలను తీసింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న క్లాస్ రూం రక్తసిక్తమైంది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి ఏకంగా 100 మంది చిన్నారులు బలైయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడ ఇంత ఘోరకలి జరగలేదు. ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లోని ఓ స్కూల్ ఉగ్ర ముష్కరులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కాజ్ ఎడ్యూకేషనల్ సెంటర్.. కాబూల్ లో ప్రముఖ విద్యాకేంద్రం. విద్యార్థులకు యూనివర్సిటీ మాక్ ఎగ్జామ్ ఉండటంతో వారంత ఒకే గదిలో కూర్చున్నారు. గది మెుత్తం విద్యార్థులతో నిండిపోయింది. ఇక ఇదే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ (ISKP) ఉగ్రవాద సంస్థ స్కూల్ ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడింది. చిన్నారులందరూ చదువుకుంటూ ఉండగా.. ఆ ఉగ్రవాది క్లాస్ రూంలోకి చొరబడి తనను తాను పేల్చుకున్నాడు. దాంతో అక్కడ మారణహోమం జరగింది. ఆ బాంబు బ్లాస్ట్ కు 100 మంది విద్యార్థులు మరణించగా.. చాలా మంది చిన్నారుల కాళ్లు, చేతులు.. తెగి కింద పడ్డాయి.
దాంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా హృదయ విదారకంగా మారింది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు స్కూల్ ఆవరణలోకి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ చిన్నారులను దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఇక ఈ చర్యను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇది నీతిమాలిన చర్యగా అమెరికా పేర్కొంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు హజారాలు, షియా జాతి వారేనని తెలుస్తోంది. ఆఫ్గానిస్థాన్ లో గత కొన్ని సంవత్సరాలుగా తెగల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. ఉగ్రవాదుల మారణహోమానికి అభం శుభం తెలియని చిన్నారులు బలికావడం చాలా దారుణం. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతాయి అనే వార్త ప్రపంచాన్ని కదిలిస్తోంది.
Before and after explosion. #Kabul #Afghanistan pic.twitter.com/juTHpdpnQ3
— Mohammad Natiq | محمد ناطق (@natiqmalikzada) September 30, 2022
These are women learning in a education center in #Afghanistan before the #Blast check the following tweet in the Thread to see what happened to them afterwards. More than 100 have already died!!#kabulblast #StopHazaraGenocide pic.twitter.com/VkA0MLFNg7
— Anastasia Петрова (@ana_petrov1) September 30, 2022
⚠️Warning ⚠️ Gore ⚠️#Afghanistan: Radical I$lam!st have attacked an educational center in minority #Hazara populated area of West #Kabul; More than 30 d€ad and scores injured. Most of them are students.
It is no brainer why they choose Friday for attacks. pic.twitter.com/CBbtxPeJqH
— KafirOphobia (@socialgreek1) September 30, 2022