ఏదైనా బ్యాంక్ పని పెండింగ్ పడిపోయిందా? ఏముందిలే అక్టోబరులో చేసుకుందాం అని తీరిగ్గా ఊరుకున్నారా? అయితే మీకు పెద్ద షాకింగ్ న్యూసే అవుతుంది ఇది. ఎందుకంటే అక్టోబర్ నెలనే బ్యాంక్ హాలిడే మంత్ అని చెబుతున్నారు. ఎందుకంటే అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు వివిధ రోజుల్లో ఇవ్వనున్న సెలవులను మొత్తం కలిపితే ఏకంగా 21 రోజులు అని తేలింది. మరి ఇంక అక్టోబర్ నెలలో ఏ రోజు సెలవులు ఉన్నాయో తెలుసుకునే బదులు ఏ రోజు బ్యాంకు ఉంటుందో తెలుసుకోవడం చాలా తేలిక అనుకుంట. అయితే అన్ని రోజులు ఎందుకు సెలవులు ఇస్తారు? అసలు ఎవరు ఆ సెలవులను నిర్ణయిస్తారు అనుకుంటున్నారు. నిజానికి బ్యాంక్ హాలిడేస్ ని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. కానీ, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా లోకల్ జరిగే పండుగల, ప్రత్యేక దినాలకు సెలవులు ప్రకటిస్తాయి.
అయితే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు వంటివి వాడే వారికి అయితే పెద్దగా ఇబ్బందులు కలగపోవచ్చు. కానీ, నేరుగా బ్యాంకులకు వెళ్లి సేవలను వినియోగించుకోవాలని చూసే వారికి మాత్రం అక్టోబర్ నెలలో పనులు అంత తేలిగ్గా జరగవనే చెప్పాలి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఉన్న వివిధ సెలవు దినాల వివరాలను తెలుసుకుందాం. నిజానికి అక్టోబర్ నెలలో రెండు ప్రధాన పండుగలు ఉన్నాయి. అక్టోబర్‌లో గాంధీ జయంతి, విజయదశమి, దీపావళికి దేశవ్యాప్తంగా రెండ్రోజుల నుంచి మూడు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. ఈ 3 సెలవులను దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు పాటిస్తున్నాయి. ఇవి కాకుండా గ్యాంగ్‌టక్ బ్యాంక్ అన్నింటికంటే ఎక్కువ సెలవులను అక్టోబర్ లో తీసుకోకున్నట్లు తెలుస్తోంది.
బ్యాంకులకు సెలవులు:
చూశారుగా.. దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో. అందుకే ఇకనైనా ఆలస్యం చేయకుండా ఆ పనులను పూర్తి చేసుకోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఒక్క అక్టోబర్ నెలలో 9 రోజుల సెలవులు ఉన్నాయి. అందుకే త్వరపడి బ్యాంకు పనులు పూర్తి చేసుకోండి.