టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరిగా చెప్పుకునే రామ్ చరణ్ – ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మెగా ఫ్యాన్స్ కూడా సంతోషంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో చెర్రీ దంపతులకు ఉప్సీ ఫ్రెండ్స్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు.
తెలుగు చిత్రపరిశ్రమలో క్యూట్ కపుల్స్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన జంటకు ప్రత్యేక స్థానం ఉంది. వీళ్ల జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు ఫ్యాన్స్. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న చెర్రీ – ఉప్సీలు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. 2012లో పెళ్లిపీటలెక్కిన ఈ జంట.. సంతానం విషయమై ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పడంతో మెగా ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. వీళ్లిద్దరూ త్వరలో పేరెంట్స్ కాబోతున్నారనే విషయం మెగా అభిమానుల్లోనూ సంతోషాన్ని నింపింది.
వివాహమైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంబురాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె ఫ్రెండ్స్ చరణ్ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి సీమంతం చేశారు. అందులో భాగంగా ఆమె మెడలో పూలదండ వేసి తనకు బహుమతులు అందించారు. ఈ వేడుకలో ఉపాసన, చరణ్ దంపతులతో పాటు ఆమె స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను బేబీ కమింగ్ సూన్ అంటూ చరణ్ సతీమణి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉండగా.. ఉపాసన తాతయ్య, అపోలో సంస్థ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇటీవలే ఘనంగా జరిగాయి. ఈ పుట్టిన రోజు వేడుకలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్, ఆయన కుమార్తె రాధే జగ్గీ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో వారితో దిగిన ఫొటోలను ఉప్సీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సద్గురు ఈ వేడుకకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ పోస్ట్‌లో ఉపాసన రాసుకొచ్చారు. సద్గురుకు ఇద్దరు కూతుళ్లని.. అందులో ఒకరు సొంత కూతురు (రాధే జగ్గీ), మరొకరు దత్తత తీసుకున్న (ఉపాసన) వారని ఆమె పేర్కొన్నారు.
Latest 📸 Baby👶Coming Soon ☺️#RamCharan and Upasana garu with Smitha reddy☺️ Her Instagram Story☺️ pic.twitter.com/v0TvPEZAfU
— Ujjwal Reddy (@HumanTsunaME) February 16, 2023
Always a pleasure to be in the presence of @sadhguru 🙏
Thank you for coming for Thatha’s birthday❤️
Big hug to @radhejaggi 🤗 pic.twitter.com/9LziijVQVv— Upasana Konidela (@upasanakonidela) February 16, 2023