తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ కామెడీ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారం అవుతున్న ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వారం వారం విభిన్నమైన కాన్సెప్ట్ లతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా జోడి నెం.1 పేరుతో సెప్టెంబర్ 18న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమో అంతా సరదాగా సాగింది. ఇందులో కమెడియన్లు.. తమ లవ్ స్టోరీల గురించి అనేక విషయాలు తెలిపారు. పరదేశి సైతం తన గుండెపై లేడి కమెడీయన్ ఐశ్వర్య పేరును రాయించుకున్నాడు. వీరితో పాటు ఆది లవ్ స్టోరికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ప్రోమోలు చూపించారు. అలా జోడి నెం.1 అనే కాన్సెప్ట్ తో వచ్చిన ప్రోమో అందరిని ఆకట్టుకుంది. ఈ షోకి రష్మి హోస్ట్ గా వ్యవహరించగా, పూర్ణ జడ్జీగా ఉన్నారు.
ఐశ్వర్య.. జబర్దస్త్ ప్రేక్షకులకు పరిచయ అక్కర్లేని పేరు. తన అందంతో, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే తాజాగా ప్రోమోలో పరదేశి.. ఐశ్వర్య పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. వారిద్దరి మధ్య ప్రేమ ఉందని మాత్రం ప్రోమో వెల్లడించలేదు. అయితే నిజంగా వారిద్దరి మధ్య ప్రేమ ఉందా? లేక గత జోడీల మాదిరిగానే ఈ జోడిని క్రియేట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ నిజమే అయితే బుల్లితెరపైకి మరో ప్రేమ జంట వచ్చినట్లే. అయితే ఇది టీఆర్పీ స్టంట్ కోసం అలా వేయికున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే పరదేశి వేయించుకున్న ఈ పేరు వెనుకాల రహస్యం గురించి తెలియాలంటే మాత్రం వచ్చే ఆదివారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి ఉండక తప్పదు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.