పల్సర్ బైక్ ఝాన్సీ.. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలు, యూట్యూబ్‌లో ఆ పేరు, ఆ పాట ఎంతో ఫేమస్ అయ్యాయి. ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షో లో ఝాన్సి చేసిన డాన్స్ పర్ఫార్మెమెన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరికొందరు ఆమెకు ఏకంగా అభిమానులు అయిపోయారు. ఆమె ఎక్స్ ప్రెషన్స్, గ్రేస్, డాన్స్ మూమెంట్స్ ఏరేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు అభినందనలతో పాటు ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో ఆమె తీవ్ర ఆవేదన చెందారు. గురుపూజోత్సవం సందర్భంగా ఝాన్సీ టీమ్.. వాళ్ల గురువు రమేష్ మాస్టర్ ని సత్కరించింది. ఆ సందర్భంగా ఝాన్సీ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తమకు మద్దతిస్తున్నారు ఉన్నారు.. అదే సమయంలో కొందరు కావాలని ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఝాన్సీ స్టేజ్ మీద తాను ఒక ఆర్టీసీ కండెక్టర్ అని, గాజువాక డిపోలో వర్క్ చేస్తానని ఆమె పరిచయం చేసుకుంది. ఆమె అలా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి, డ్యాన్స్ కోసం ఆమె కష్టాలను తెలుసుకుని ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. అయితే కొందరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో ఝాన్సీ మాట్లాడుతూ..”నన్ను కండెక్టర్ గా కాదు.. ఒక డ్యాన్సర్‌గా గుర్తించి శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లు ఆహ్వానించారు. అక్కడ నేను చేసిన పర్ఫార్మెన్స్ కి ఎంతో గొప్ప పేరొచ్చింది. అయితే వీడియోస్ కింద కొందరు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. నన్ను సపోర్ట్ చేసిన నా భర్తను కూడా తిడుతున్నారు. దయచేసి అలా చేయకండి” అంటూ ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. ఝాన్సీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.