తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కామెడీ షోలలో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఒకటి. చాలా ఏళ్ళ నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ షోలో మొదటి నుండి రష్మీ గౌతమ్ యాంకర్ గా కొనసాగుతోంది. అయితే.. ప్రతివారం పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేముందు ప్రోమో రిలీజ్ చేస్తుంటారు నిర్వాహకులు. ఈ వారం కూడా శుక్రవారం రోజునాటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు. అయితే.. ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జిలుగా నటి ఇంద్రజతో పాటు సింగర్ మనో కనిపిస్తున్నారు.
ఈ క్రమంలో ఎక్స్ట్రా జబర్దస్త్ కొత్త ప్రోమోలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ కమెడియన్స్ అంతా మంచి కామెడీ పండించారు. ముఖ్యంగా ఆటో రాంప్రసాద్ టీంతో పాటు రాకింగ్ రాకేష్ టీమ్ పెర్ఫార్మన్సులు కొత్తగా ఉన్నాయి. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఇమ్మానుయేల్, వర్షల కాంబినేషన్ కామెడీ ఆకట్టుకోగా.. ఈసారి భాస్కర్ టీమ్ లోకి గాజువాక కండక్టర్ ఝాన్సీ ఎంటరై మరోసారి తన డాన్స్ టాలెంట్ చూపించింది. అనంతరం యాంకర్ రష్మీ వచ్చి ప్రస్తుతం లైఫ్ ఎలా ఉందని అడగడంతో ఎమోషనల్ అయ్యింది ఝాన్సీ.
రష్మీ మాట్లాడుతూ.. ‘ఝాన్సీ గారు మీ పెర్ఫార్మన్స్ రీసెంట్ గా టీవీలో టెలికాస్ట్ అయ్యింది కదా.. లైఫ్ ఎలా ఉంది?’ అని అడిగింది. అనంతరం ఝాన్సీ స్పందిస్తూ.. “ఎందుకు డాన్స్ చేసావు అన్నవాళ్ళే.. ఇప్పుడు ఫోన్ చేసి మీ వల్ల మా ఫ్యామిలీ పరువు నిలబడింది అంటున్నారు. ఈ స్టేజికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు” అంటూ భావోద్వేగానికి గురైంది. అలాగే ఏడుస్తూ జబర్దస్త్ స్టేజిని ముద్దాడింది ఝాన్సీ. ప్రస్తుతం గాజువాక కండక్టర్ ఝాన్సీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఝాన్సీ టాలెంట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.