సాధారణంగా కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని విజయాలను అందుకుంటాయి. మరికొన్ని సినిమాలు రిలీజ్ ముందు భారీ ప్రమోషన్స్, హైప్ క్రియేట్ చేసి తీరా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. మరి అంచనాలు లేని సినిమా ఎందుకు ఆడింది? ఇంత భారీ క్రేజ్ ఉన్న సినిమా ఎందుకు ఆడలేదు? అంటే.. సినిమాలో మ్యాటర్ మాత్రమే కారణం. సినిమాలో ఎంత భారీ కాస్ట్ ఉన్నా, కంటెంట్ లేకపోతే ఓటమి తప్పదు. ఇది ఆల్రెడీ కొంతకాలంగా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఇటీవల లైగర్ మూవీ విషయంలో కూడా అదే జరిగింది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘లైగర్‘. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే.. భారీ ప్రమోషన్స్ తో జనాల్లో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఆగష్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఇక విడుదలైన ఫస్ట్ షో నుండి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కల్లెక్షన్స్ పరంగా కూడా అంచనాలు అందుకోలేకపోయింది. అయితే.. థియేటర్స్ లో విడుదలై నెల పూర్తవకుండానే లైగర్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాతోనే అటు బాలీవుడ్ లోకి విజయ్, టాలీవుడ్ లోకి అనన్య డెబ్యూ చేశారు. ఇదిలా ఉండగా.. లైగర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు దక్కించుకున్నారు. ఆగష్టు 25న విడుదులైన ఈ సినిమా మినిమమ్ 50 రోజుల తర్వాత ఓటిటిలోకి రాబోతుందని అంతా అనుకున్నారు. కానీ.. నాలుగు వారాలకే అంటే.. సెప్టెంబర్ 22 నుండే(తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం) హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ లేట్ అవ్వొచ్చని సమాచారం. మరి లైగర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Liger OTT premiere from Sep 22 on @DisneyPlus ❤❤💥@TheDeverakonda #VijayDeverakonda pic.twitter.com/2KrIEnKt9q
— PAVAN KUMARᴸᶦᵍᵉʳᵒⁿᴬᵘᵍ²⁵🐯 (@PavanKumar2075) September 20, 2022