బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. తన బర్త్ డే గిఫ్ట్ గా లగ్జరీ బెంజ్ కారుని సొంతం చేసుకుంది. తన బర్త్ డే రోజున రామ్ గోపాల్ వర్మ సహా పలువురి సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చింది. వర్మ అషు రెడ్డితో కేక్ కట్ చేయించడం.. ఒకరికొకరు కేక్ తినిపించుకోవడం ఇలా ఆరోజు రాత్రి రచ్చ రచ్చ చేశారు. ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో పాపులర్ అయిన అషు రెడ్డి.. బిగ్ బాస్ షోలో పాల్గొని ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై వరుస షోస్ తో దూసుకుపోతోంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి.. హాట్ ఫోటోలతో ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తుంటుంది. తాజాగా ఆమె పింక్ డ్రెస్ లో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. చిన్న గౌను వేసుకుని ఎక్స్ పోజ్ చేస్తూ మెట్లకి ఆనుకుని ఉన్న గట్టు మీద కూర్చుని రెండు ఫోజులు, బెంచ్ మీద కూర్చుని ఒక స్టిల్ ఇచ్చింది. ఇదొక పింక్ డే అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక్కడితో ఈ బ్యూటీ పనే కాదు, ఫోటోలు చూసిన కుర్రాళ్ళ పని కూడా అయిపోయింది. ఆ పింక్ డ్రెస్ లో అషు రెడ్డి కాళ్ళని చూస్తుంటే.. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అంటూ ఓ సాంగ్ వేసుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఈ ఫోటోలని చూసి ‘హాట్ గా ఉన్నావ్ అషు బేబీ’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. మరి కొందరేమో ‘ఎల్కేజీలో కుట్టించావా పాప ఈ డ్రెస్సు, మతోయిందంటే ప్రామిస్సు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అషు రెడ్డి షేర్ చేసిన ఈ పింక్ డ్రెస్ ఫోటోలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.